VIDEO: ‘స్ఫూర్తి’- ఛాత్రశక్తి భవన్’ ఏబీవీపీ నూత‌న కార్యాల‌య‌ ప్రారంభోత్స‌వంలో డా. శ్రీ మోహ‌న్ జీ భ‌గ‌వ‌త్ ప్ర‌సంగం

VSK Telangana    20-Jun-2022
Total Views |

bhagwatji

అన్యాయాలను ఎదురించి.. బలిదానమిచ్చిన కార్యకర్తల తప ఫలమే స్పూర్తి భవనం. ఈ పేరు సరైనదే. ఇక్కడి ఏబీవీపీ కార్యానికి ఘన చరిత్ర ఉన్నది ఇదంతా చూసి ఒక స్ఫూర్తి ఉద్భవిస్తుంది. మొదటినుండి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత కార్యం అగ్రస్థానంలో ఉంది, ఎలా ఉండాలో తెలంగాణ ఏబీవీపీ చూపింది. ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం మరోవైపు ఆవిరోధులతో కలిగిన నష్టాన్ని నివారించడం. ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీ కే చెల్లింది వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయం. సంఘ ప్రార్థన లో చెప్పినట్లు ఇది కంట కాకీర్ణ మార్గము, 30 ఏళ్ళ క్రితమే ఇది మనకు అనుభవైకవేద్యం అయినది.