తప్పుడు పత్రాలు కలిగిన విదేశీయుల అరెస్ట్

VSK Telangana    01-Oct-2024
Total Views |
 
banglore police
 
బెంగళూరులో కొన్ని రోజుల క్రిందటే ఉల్ఫా తీవ్రవాది అరెస్టయ్యాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో పాకిస్తానీలతో సహా నలుగురు విదేశీ పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శర్మ అన్న పేరును చివర చేర్చుకొని, అక్రమంగా వున్నాడు. అంతేకాకుండా శంకర్ శర్మ, ఆశా రాణి, రాంబాబు శర్మ, రాణీ శర్మ పేర్లతో ఆధార్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు కూడా పొందాడు. కానీ ఇంట్లో మాత్రం ఇస్లాం మత  పెద్దల ఫొటోలు పెట్టుకున్నాడు. 
 
అయితే.... అక్రమంగా నివసిస్తున్న పాక్, బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని రాజపుర సమీపంలో వుండే ఓ అపార్ట్ మెంట్‌లో పాకిస్తానీ జాతీయుడు తన కుటుంబంతో కలిసి వుంటున్నాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి పాక్, బంగ్లా మూలాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారని ఇంటెలిజెన్స్ గుర్తించిన తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.
 
 
Pak fake hindu family
 
ఈ వ్యక్తి 2014లో బంగ్లాదేశ్ మహిళను ఈ పాక్ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ కారణంగానే పాక్ నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానికులు సాయం చేయడంతో భారత్ లోకి అక్రమంగా వచ్చేశాడు. రాగానే అక్రమంగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టును కూడా పొందాడు. బెంగళూరు కంటే ముందు 2018 వరకు ఢిల్లీలోనే వున్నారు. ప్రస్తుతం జిగానీ ప్రాంతంలో పిల్లలహా సహా వుంటున్నాడు. అయితే.. గతంలో ఇంటెలిజెన్స్ అధికారులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. అయితే గుర్తింపు కార్డులను ఎలా సంపాదించాడన్న పనిలో పోలీసులు విచారణ చేస్తున్నారు.