భారత్ మాతాకీ జై నినాదం.. చితక్కొట్టిన ప్రిన్సిపాల్

VSK Telangana    01-Oct-2024
Total Views |
 
bharath mata
 
కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్ డయ్యూలో దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది. ఓ ఆంగ్ల పాఠశాలలో భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినాదాలు చేసినందుకు ప్రిన్సిపాల్ ఎడ్మండ్ మస్కరెన్హాస్ విద్యార్థులను చితక్కొట్టాడు. ఈ విషయాన్ని హిందూ సంస్థలు బయటకి తెచ్చి, తీవ్ర ఆందోళనలు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున జాతీయ గీతాలాపన తర్వాత విద్యార్థులు భారత్ మాతాకీ జై, జై హింద్ అని నినాదాలు చేశారు.
 
దీంతో విద్యార్థులను ప్రిన్సిపాల్ తీవ్రంగా కొట్టాడు. అయితే... ఏ విద్యార్థులు నినాదాలో చేశారో తెలుసుకోకుండానే విద్యార్థులను చితకబాదాడు. అయితే.. ప్రిన్సిపాల్ మస్కరెన్హాస్ విద్యార్థులను కొడుతుండటంతో మిగతా విద్యార్థులు తీవ్రంగా భయపడి, పాడిపోయారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు నేపథ్యంలో కిమ్మనకుండా వుండిపోయారు.
 
విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు భరత్ సోలంకి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ గీతం ముగిసిన వెంటనే విద్యార్థులు భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించారు. దీంతో ప్రిన్సిపాల్ తీవ్రంగా కొట్టారు. తమని ఏమీ చేయవద్దని విద్యార్థులు వేడుకొన్నా, ప్రిన్సిపాల్ మరింత రెచ్చిపోయి చితకబాదారని పేర్కొన్నారు.