VSK తెలంగాణ వార్తాకథనాలను వెనువెంటనే చూసేందుకు మీ ఫోన్‌లో VSK Telangana App ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ క్రింది లింక్ నొక్కి Appను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విజయదశమి ఉత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ భాగవత్ నాగపూర్‌లో స్వయంసేవకులనుద్దేశించి ప్రసంగం చేశారు. నాగపూర్‌లో జరిగిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఇస్రో మాజీ చైర్మన్ డా.కే. రాధాకృష్ణన్ హాజరయ్యారు. సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు అంశాల వారీగా...
పుణ్యశ్లోక దేవీ అహల్యా బాయి హోల్కర్ జీ
ఈ సంవత్సరం పుణ్యశ్లోక అహల్యా దేవి హోల్కర్ జీ 300వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. దేవి అహల్యాబాయి నైపుణ్యం కలిగిన, ప్రజలహితమే కర్తవ్యంగా భావించిన పాలకురాలు. ఆమె ధర్మం, సంస్కృతి, దేశం పట్ల అభిమానము, నిరాడంబరతకు గొప్ప ఉదాహరణ. యుద్ధ నీతిపై అద్భుతమైన అవగాహన ఉన్న పాలకురాలు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అద్భుతమైన సామర్థ్యాన్ని చూపడం; తీర్థక్షేత్రాల పునరుద్ధరణ, దేవాలయాలను నిర్మించడం ద్వారా సమాజంలోని సంస్కృతి యొక్క సామరస్యాన్ని కాపాడిన తీరు మనందరికీ ఆదర్శప్రాయమైనది. ఆమె భారతదేశ మాతృశక్తి యొక్క కర్తృత్వ, నేతృత్వ దక్షతకు నిదర్శనం.
మహర్షి దయానంద సరస్వతి
ఈ సంవత్సరం ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు మహర్షి శ్రీ దయానంద్ సరస్వతి గారి 200వ జయంతి కూడా. పరాధీనత నుండి విముక్తి పొందిన తరువాత, కాల ప్రవాహంలో సామాజిక ఆచారాలలో వచ్చిన దోషాలను తొలగించి, వాటి శాశ్వతమైన విలువలపై సమాజాన్ని స్థాపించడానికి గొప్ప ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని ముందుకు నడిపించినవారిలో వారి పేరు ప్రముఖమైనది.
సత్సంగ ప్రచారం
రామరాజ్యం వంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రజలలో ఉన్నతమైన నడవడి, స్వీయమతంపై విశ్వాసం, నిష్ట ఉండటం అవసరం. అటువంటి సంస్కృతిని, బాధ్యతను ప్రతి ఒక్కరిలో పెంపొందించే "సత్సంగం" ప్రచారాన్ని గౌరవనీయులైన శ్రీశ్రీ అనుకూలచంద్ర ఠాకూర్ ప్రారంభించారు. నేటి బంగ్లాదేశ్, అప్పటి ఉత్తర బెంగాల్‌లోని పాబ్నాలో జన్మించిన శ్రీ శ్రీ అనుకులచంద్ర ఠాకూర్ జీ హోమియోపతి వైద్యుడు. తల్లి ద్వారా ఆధ్యాత్మిక సాధనలో అడుగుపెట్టారు. వ్యక్తిగత సమస్యల గురించి తన దగ్గరకు వచ్చిన వ్యక్తుల్లో సత్సంగం' ద్వారా సద్గుణాలను, సేవాతత్పరతను పెంచేవారు. అదే ఆతరువాత 1925 సంవత్సరంలో ధార్మిక సంస్థగా మారింది. 2024 నుండి 2025 వరకు, ఈ సంస్థ శతజయంతి కూడా 'సత్సంగ్' ప్రధాన కార్యాలయమైన దేవఘర్ (జార్ఖండ్)లో నిర్వహించనున్నారు.
భగవాన్ బిర్సా ముండా
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. ఆదివాసీ ప్రజలను బానిసత్వం, దోపిడీ, విదేశీ ఆధిపత్యం నుండి విముక్తం చేయడానికి, వారి ఉనికి, గుర్తింపును, స్వీయ ధర్మాన్ని రక్షించడానికి భగవాన్ బిర్సా ముండా చూపిన ఉల్గులన్ స్ఫూర్తిని ఈ జయంతి మనకు గుర్తు చేస్తుంది. భగవాన్ బిర్సా ముండా అద్భుతమైన జీవనం కారణంగా గిరిజన సోదరుల ఆత్మగౌరవం, అభివృద్ధి, సహకారానికి బలమైన పునాది ఏర్పడింది.