హిందువులందరి చూపూ ఇప్పుడు అయోధ్య రామ మందిరం వైపే. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొట్ట మొదటి దీపావళి పండుగ ఇదే. 500 సంవత్సరాల తర్వాత అయోధ్య రాముడు అయోధ్యలో దీపావళి చేసుకుంటున్నాడు. దీంతో ట్రస్ట్ కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా 28 లక్షల దీపాలు, 50 క్వింటాళ్ల పూలతో మందిరాన్ని అలంకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొస్తున్నాయి.
అయితే 28 లక్షల దీపాలను వెలిగిస్తున్న నేపథ్యంలో ట్రస్టు కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. దీపాలు వెలిగించినా, మరకలు, మసి అంటకుండా చూసుకుంది. మరకలు, మసి అంటని ప్రమిదలను తీసుకొచ్చింది. వీటితో దీపావళి పర్వదినం అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసేలా చేయాలని సిద్ధమైంది. అయోధ్య రామ మందిరం కోసం కొన్ని సంవత్సరాల పాటు హిందూ సమాజం పోరాటాలు చేసింది.
ఇప్పుడు హిందూ సమాజం కలలుగన్న రామ మందిర ప్రతిష్ఠితమైంది. ఈ సందర్భంగా దీపాలు వెలిగించడం వల్ల ఆలయం మరకలు పడకుండా, అలాగే అద్భుతమైన వెలుగులతో ఆలయం వెలిగిపోయేలా కూడా ఈ ప్రమిదలను ఎంపిక చేశారు. ఈ పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు, ఆలయ అలంకరణను పర్యవేక్షించేందుకే ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని కూడా ట్రస్ట్ నియమించింది.
లైటింగ్, శుభ్రత, అలంకరణ మొదలైన వాటి నిర్వహణకి కూడా ఓ ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. బిహార్ కేడర్ కి చెందిన స్వచ్ఛంద పదవీ విరమణ పొందన ఐజీ అష్ణు శుక్లా ఈఅన్ని ఏర్పాట్లనూ చూస్తున్నారు. ముఖ్యంగా దీపాల అలంకరణ వల్ల ఎలాంటి ఇబ్బందులురాకుండా చూసుకుంటున్నారు. దీని కోసం మైనపు ప్రమిదలను వాడుతున్నారు. ఈ నెల 29 నుంచి నవంబర్ 1 వరకూ ఈ అలంకరణ వుంటుందని, భక్తులు గేట్ నెంబర్ 4బీ ద్వారా వచ్చి తిలకించవచ్చని ట్రస్ట్ ప్రకటించింది.