దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దీపావళికి మరో ప్రత్యేకత కూడా ఉందని, అయోధ్య ఆలయంలో రాముడు దీపావళి జరుపుకోనున్నాడని చెప్పారు. ఇలా జరగడం గత 500 ఏళ్లలో ఇదే మొదటిసారని అన్నారు. "దీపావళి పర్వదినం సందర్భంగా దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరో రెండు రోజుల్లో దీపావళికి జరుపుకోనున్నాం. ఈ ఏడాది దీపావళికి ప్రత్యేకత ఉంది. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోని భవ్యమందిరంలో రాముడు కొలువయ్యాడు. ఆయనతో కలిసి దీపావళి జరుపుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇలాంటి ప్రత్యేకత కలిగిన గ్రాండ్ దీపావళిని చూసే అదృష్టం మనందరికీ కలుగుతోంది'' అని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి ఇదే కావడం విశేషం.