ఒడిశాలోని కోణార్క సూర్య దేవాలయం రథచక్రాల నమూనాలను రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేశారు. అచ్చు కోణార్క్ చక్రాలను తలపించేలా ఎర్రని ఇసుకరాతితో రూపొందించిన నాలుగు చక్రాలను రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం, అమృత్ ఉద్యాన్ లలో ప్రతిష్ఠించారు.భారత సమున్నత వారస్వత వైభవాన్ని సందర్శకులకు పరిచయం చేయాలనే ఈ చక్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, చారిత్రక ఆనవాళ్లను రాష్ట్రపతి భవన్ లో ప్రవేశపెట్టడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే కోణార్క్ చక్రాల ప్రతిరూపాలు పెట్టినట్లు తెలిపింది.