గిన్నీస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవం

VSK Telangana    02-Nov-2024
Total Views |
 
ayodhya
 
రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్యలో జరిగిన తొలి దీపోత్సవం రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. అత్యధికంగా 25 లక్షల ప్రమిధలు వెలిగించడంతో అయోధ్య దీపకాంతుల్లో మిలమిలలాండింది. అలాగే 1,121 వేదాచార్యులు ఏకకాలంలో హారతి ఇవ్వడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది. ‘మొత్తం 1,121 మంది ఏకకాలంలో హారతి ఇవ్వడం రికార్డుయే.
 
ఉత్తరప్రదేశ్ టూరిజం, అయోధ్య జిల్లా యంత్రాంగం, సరయూ ఆరతి సమితి.. అత్యధిక మంది ఏకకాలంలో హారతులిచ్చిన రికార్డు మీ సొంతం’ అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జ్యుకేటర్ ప్రవీణ్ పాటిల్ బుధవారం ప్రకటించారు. 25 లక్షల పైచిలుకు ప్రమిధలను వెలిగించి.. అయోధ్యను దేద్వీప్యమానంగా వెలుగొందేలా చేసిన యూపీ టూరిజం, యూపీ ప్రభుత్వం, డాక్టర్ రామ్మనోహర్ లోహియా అవధ్ యూనివర్శిటీలకు శుభాబినందనలు. ఇది గిన్నిస్ రికార్డు’ అని ప్రవీణ్ పేర్కొన్నారు. అత్యధిక దీపాలు వెలిగించడంలో గత రికార్డు 22.23,676గా ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామాలయంలో ప్రమిధను వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు.