అయోధ్య, శ్రీరాముడు లేని భారత క్షేమాన్ని అస్సలు ఊహించలేమని అయోధ్య సిద్ధపీఠం హనుమత్ నివాస్ పీఠాధిపతి ఆచార్య మిథిలేశ్ నందిని శరణ్ అన్నారు. లోక్ అంటే వృక్ష సంపద మొదలు బృహస్పతి వరకూ ఉన్నదనే అర్థం అని వివరించారు. లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 ముగింపు కార్యక్రమంలో ఆయన ఆశీ:పూర్వక ప్రసంగం చేశారు. అందర్నీ కలుపుకొని సామరస్యంగా జీవించడమే భారతీయ సమాజ ప్రాథమిక అంశమని గుర్తు చేశారు. ఇక్కడి సమాజంలో ఎప్పుడూ చీలికలు, విభజనలు లేవన్నారు. కుట్ర చేస్తూ మాట్లాడేవారు సమాజంలో విభజనకు పూనుకుంటారని అన్నారు. రాముడు లంకపై సమరానికి వెళ్లిన సమయంలో సైన్యాన్ని కాకుండా వానరాలను, అరణ్యవాసులను తమ వెంట తీసుకెళ్లారని గుర్తు చేశారు. వీరి సాయంతోనే రావణ బ్రహ్మ వధ జరిగిందని తెలిపారు.