బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయం ధ్వంసం.. ముస్లిం ఛాందసుల దాడి

VSK Telangana    28-Nov-2024
Total Views |
 
temple
 
మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై నిరంతరం దాడులు చేస్తూనే వుంది. అక్కడి మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని పదే పదే ప్రకటనలు చేసినా, అది కార్యరూపం దాల్చడం లేదు. నిరంతరం హిందువులపై కక్షగట్టే క్రియలకే దిగుతోంది. మొన్న ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసింది. ఇస్కాన్ ను నిషేధించడానికి కూడా ప్లాన్ వేస్తోంది. ఈ సమయంలో అక్కడి మత ఛాందసులు హిందూ దేవాలయంపై దాడి చేసి, ధ్వంసం చేశారు. చిట్టగాంగ్ లో వున్న లోకనాథ్ ఆలయంపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ విడుదల చేశారు. ఈ వీడియోలో ముస్లింల ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది.
 
ముస్లిం ఛాందసవాదులు కర్రలు, రాడ్లు మరియు కత్తులతో వీధుల్లో బహిరంగంగా అరుస్తూ ఆలయంపై రాళ్లు రువ్వారు. దీనిపై భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా... ఇతర ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.దీనితో పాటు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్, మత ఛాందసవాదులు సాగిస్తున్న హింసను ఆయన విమర్శించారు.
 
నవంబర్ 22 న కూడా బంగ్లాదేశ్ లోని ఉత్తర మగురాలోని ప్రసిద్ధ కాళీదేవాలయంపై ఛాందసులు దాడి చేశారు. విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు.అయితే విధ్వంసం చేసిన ఛాందసుడ్ని హిందువులు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. అలాగే అదే నెలలో 11 వ తేదీన రాజబరి జిల్లా చమట గ్రామంలో కూడా దేవాలయంపై దాడి జరిగింది.
 
అక్టోబర్ 10, 2024న సత్ఖిరాలోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ కాళీ దేవాలయంలో బంగారు కిరీటం దొంగతనం జరిగింది. విశేషమేమిటంటే, 2021లో ప్రధాని మోదీ ఈ కిరీటాన్ని మా కాళికి అంకితం చేశారు.2024 ఆగస్టు 21న ఇలాంటి మరో ఘటనలో 50 మంది ముస్లిం మత ఛాందసవాదులు బంగ్లాదేశ్‌లోని ఘాజీపూర్ ఉపజిల్లాలోని కలియాకైర్‌లో ఉన్న రాధా గోవింద్ లోక్‌నాథ్ నాట్ ఆలయాన్ని ధ్వంసం చేశారు.