బంగ్లాదేశ్ లో వున్న హిందూ వ్యతిరేక ప్రభుత్వం కుట్ర ఫలించలేదు. ఇస్కాన్ ను బ్యాన్ చేసి, ఆ సంస్థపై దుష్ప్రచారం చేయాలనుకున్న అక్కడి ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇస్కాన్ పై నిషేధం విధించడం కుదరదని, ఆ పిటిషన్ ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఇస్కాన్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ, దానిపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టేసింది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, తదనంతర పరిణామాలపై వచ్చిన కథనాలను అక్కడి న్యాయవాది మునీరుద్దీన్ కోర్టు ముందుంచినా... కోర్టు ఇస్కాన్ పై నిషేధానికి ససేమిరా అంగీకరించలేదు.
ఈ పిటిషన్ ను జస్టిస్ ఫరా మొహబూబ్, జస్టిస్ దేబాశిష్ రాయ్ చౌదరీ ధర్మానం విచారణ చేపట్టింది. ఇస్కాన్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు, వేర్వేరు ప్రాంతాల్లో హిందువులపై జరిగిన దాష్టీకాలన నివేదికను అటార్నీ జనరల్ హైకోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన తర్వాతే ఇస్కాన్ పై నిషేధమే అక్కర్లేదని తేల్చి చెప్పింది.