అక్రమ మతమార్పిడిదారులు ఏకంగా అయోధ్య ప్రాంతంలోనే సభలు ఏర్పాటు చేసుకున్నారు. అయోధ్యలోని కుషహారీ గ్రామంలో మతమార్పిడి సభ జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకొని ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. కుషహారీ గ్రామంలోని ఓ గుడిసెలో ఏర్పాటు చేసిన మతమార్పిడి ప్రార్థనా సమావేశానికి 40 మంది హాజరయ్యారు. భూతవైద్యం, వ్యాధుల నయం పేరుతో వీరందరూ అక్కడికి వచ్చారు. అయితే తమకున్న వ్యాధులన్నీ ప్రార్థనలతో నయం చేస్తామంటూ మతమార్పిడి ముఠా గ్రామస్థులను నమ్మించాయి.
దీంతో చాలా మంది గ్రామస్థులు తరలి వచ్చారు. దీనికి సంబంధించిన కరపత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూత వైద్యం నయం పేరుతో మిషనరీలు ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తూ... హిందువులను ఏమార్చుతున్నారని, బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడ్డాయి. అయితే అరెస్ట్ చేసిన వారిని తాము విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అయోధ్యలో మత మార్పిడి కేసులు పెరుగుతున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీనిపై అవగాహన పెంచేందుకు హిందూ సంఘాలు మరింత పనిచేయాల్సి వుంది.