కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో ‘మనగుడి’ నిర్వహించనున్నట్టు టీటీడీ ఓ ప్రకటలో తెలిపింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో రెండు చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు, జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం నిర్వహిం చనున్నట్లు టీటీడీ పేర్కొంది.