అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన రామ్ టెంపుల్ ప్రాజెక్టుకి అరుదైన అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టుకి బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ ‘‘స్వోర్డ్ ఆఫ్ హానర్’’ అవార్డును ప్రదానం చేసింది. ఈ విషయాన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.భద్రతా నిర్వహణ విషయంలో ఈ అత్యున్నత అవార్డు లభించిందని, ఈ విషయాన్ని బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ తన ఆడిట్ ల సమయంలో భద్రతకి సంబంధించిన విషయాలన్నింటినీ అంచనా వేస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆన్ సైట్ కార్యాచరణ అంచనాలను కూడా చేస్తుందని తెలిపారు.
అలాగే ఆలయ నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహించిన లారెన్స్ అండ్ టూబ్రో సంస్థకి కూడా నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ‘గోల్డెన్ ట్రోఫీ’’ అవార్డును బహూకరించింది. భద్రతా ప్రమాణాల విషయంలో ఈ అవార్డు వచ్చిందని మిశ్రా ప్రకటించారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమర్థవంతమైన పర్యవేక్షణలో లారెన్స్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్ల సమన్వయంతో ఈ ఆలయం నిర్మాణం జరుగుతోంది.అయితే ఆలయం శిఖరంతో సహా మొదటి రెండు అంతస్తుల నిర్మాణం చివరి దశలో వుంది. జూన్ 2025 నాటికి పూర్తవుతుంది.రాజస్థాన్‌కు చెందిన బన్సీ పహర్‌పూర్ రాయిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు, మొత్తం సుమారు 15 లక్షల క్యూబిక్ అడుగుల రాతితో పాటు ముఖ్యమైన పాలరాతి క్లాడింగ్‌తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.