అయోధ్య రామాలయ వార్షికోత్సవాలు... కార్యక్రమ వివరాలివీ

VSK Telangana    23-Dec-2024
Total Views |
 
mandir
 
500 సంవత్సరాలు గా హిందువులు కలలుగన్న అయోధ్య శ్రీరామజన్మభూమి భవ్యమైన మందిరాన్ని నిర్మాణంచేస్తూనే బాలరాముడిని ప్రతిష్టాపన చేసి ఒక సంవత్సరం పూర్తికావస్తున్నది. ప్రపంచంలోని శ్రీరామభక్తులు ఎదురు చూస్తున్నట్లుగా త్వరలోనే అయోధ్య రాముడి తొలి వార్షిక వేడుకలు నిర్వహించేందుకు తేదీలు నిర్ణయమైనాయి. అయోధ్య ట్రస్ట్ సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకుంది.
 
ఆలయంలో వార్షిక ఉత్సవాలు:
 
హరి ఓం—- భారతీయ పంచాంగం ప్రకారం శ్రీరామజన్మభూమి ఆలయంలో రామలలా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన మొదటి సంవత్సరం, 2025 జనవరి నెలలో పుష్యమాసంలో శుక్ల ద్వాదశి (22 జనవరి 2024), ప్రతిష్టాపన జరిగింది. ఈ సంవత్సరం పుష్యమాసం శుక్ల ద్వాదశి రోజునుండి (జనవరి 11న) ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
 
"ప్రతిష్ఠ ద్వాదశి" :
 
- 500 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు 'బాలరాముడి'గా తన జన్మస్థలం లో నిర్మితమైన నూతన స్వగృహంలో పునఃప్రతిష్ఠితుడై కొలువుదీరిన రోజును "ప్రతిష్ఠ ద్వాదశి" అని పిలుస్తారు,
- ఈ సందర్భంగా అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరం పరిసర ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఉత్సవాలు, విశేషకార్యక్రమాలు 'నాలుగు ప్రదేశాలలో' జరుగుతాయి,
 
1) ఆలయ సముదాయంలోని యాగ మండపంలో జరిగే కార్యక్రమాలు*
 
-శుక్ల యజుర్వేదం మధ్యందని శాఖలోని 40 అధ్యాయాల 1975 మంత్రాలతో యజ్ఞం భగవానుడికి ఆహుతులు సమర్పిస్తారు, 11 అంశాలుగా వేద మంత్రాలు జపిస్తారు. ఇట్టి యజ్ఞ కార్యక్రమం ఉదయం 8 నుండి 11:00 గంటల వరకు మరియు సాయంత్రం 2 నుండి 5:00 గంటల వరకు జరుగుతుంది.
 
-శ్రీరామ మంత్రం జపించే యాగం కూడా ఇదే కాలంలో రెండు దఫాలుగా నిర్వహిస్తారు, 6 లక్షల మంత్ర జపం జపిస్తారు, అంతే కాకుండా, శ్రీ రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్తం, శ్రీ సూక్తం, ఆదిత్య హృదయం పారాయణం కూడా ఉంటుంది. ఆదిత్యహృదయం స్తోత్రం, అథర్వశీర్ష మొదలైనవి ఉంటాయి.
 
2) దేవాలయం క్రింది అంతస్తులో కార్యక్రమం
 
- దక్షిణ దిశలోని ప్రార్థనా మండపంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్వామికి 'రాగసేవ' సమర్పిస్తారు.
 
-ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9:00 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో రాంలాల సన్నిధిలో అభినందన గీతాలు, భక్తి గీతాలు, మంగళ హారతులుంటాయి.
 
3) శ్రీరామచరితమానస' పఠనం
 
'యాత్రీ సువిధాకేంధ్ర' (యాత్రికుల సువిధ కోసం ఏర్పాటుచేసిన భవనం) లోని మొదటి అంతస్తులో మూడు రోజుల సంగీతమయ 'శ్రీరామచరితమానస' పఠనం ఉంటుంది.
 
4) శ్రీరామచరితమానస్' పై ప్రసంగాలు
 
'అంగద్ టీల మైదానం'లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 3:30 వరకు శ్రీరామకథ మరియు 3:30 నుండి 5:00 గంటల వరకు 'శ్రీరామచరితమానస్' పై ప్రసంగాలు ఉంటాయి.
 
—-రోజూ సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
 
- జనవరి 11వ తేదీ ఉదయం నుంచి స్వామివారి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది.
 
—- అంగద్ టీల యొక్క అన్ని కార్యక్రమాలకు మొత్తం సమాజాన్ని భక్తులను గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు, ఈ మైదానంలో భద్రతకు సంబంధించిన అవరోధాలు/అడ్డంకులు ఉండవు.
 
2024 సంవత్సరం ప్రారంభంలో ఐదు లక్షల పదివేలకు పైగా గ్రామాలకు వెళ్లి 17 కోట్ల కుటుంబాలకు చెందిన 40 కోట్లకు పైగా శ్రీరామ భక్తులను కలిసి అక్షతలు ఇచ్చి అయోధ్యకు ఆహ్వానించడం జరిగింది. అయితే అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరాన్ని ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు, 3153 మంది విదేశీయులు దర్శనం చేసుకున్నారు.