మొన్న సంభాల్, వారణాసి.. నేడు అమేథీ... బయటపడ్డ మరో పురాతన దేవాలయం

VSK Telangana    25-Dec-2024
Total Views |
 
amethi
 
సంభాల్, వారణాసి, అలీఘర్, కాన్పూర్... పురాతన దేవాలయాలు బయటపడుతున్నాయి. అత్యంత పురాతన దేవాలయాలు ఈ మధ్య చాలా బయటపడుతూ సనాతన ధర్మ ఆనవాళ్లను చూపుతున్నాయి. తాజాగా మరో ప్రాంతంలో అత్యంత పురాతన శివాలయం వెలుగులోకి వచ్చింది. యూపీలోని అమేధీలో 120 సంవత్సరాల పురాతన శివాలయం వెలుగు చూసింది.ముసాఫిర్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్ గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానిక ముస్లిం సమాజానికి చెందినవారు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ శివాలయం పంచశిఖర దేవాలయంగా పిలుచుకుంటారు. రెండు దశాబ్దాలుగా ఈ దేవాలయం ఆక్రమణలోనే వుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆక్రమణలే కాకుండా తాము పూజలు కూడా జరుపుకోకుండా చేశారన్నారు. స్థానికుల కథనం ప్రకారం ఈ శివాలయం 120 సంవత్సరాల క్రితం ఓ దళిత కుటుంబం శివుడ్ని స్థాపించినట్లుగా చరిత్ర చెబుతోందని అంటున్నారు. అప్పటి నుంచే ఈ ప్రాంతం అత్యంత పవిత్రంగా, హిందువులకు పవిత్ర స్థలంగా మారిపోయింది. గత 20 సంవత్సరాలుగా పూజలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టారని, ఆక్రమణలు కూడా చేశారని హిందువులు అంటున్నారు.
సంభాల్, ఇతర ప్రాంతాలను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామస్థులు హిందూ సంఘాల నేతృత్వంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దేవాలయాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దేవాలయం తిరిగి తెరుచుకునేట్లు, తాము పూజలు చేసుకునే వాతావరణం కల్పించాలని హిందువులు డిమాండ్ చేశారు.ఈ విషయంపై ఎస్‌డిఎం ప్రీతి తివారీ మాట్లాడుతూ.. విచారణను తహసీల్దార్‌కు అప్పగించినట్లు తెలిపారు. నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.