వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంగణంలో అన్యమతస్థులు మాంసాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటన జరగడం, పైగా ప్రధాన ఆలయం సమీపంలోని బిర్యానీ ప్యాకెట్లను పంచడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానిక హిందూ సంఘాలు సంఘటన స్థలానికి చేరుకుని మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆలయ ప్రాంగణంలోనే అన్యమతస్థులు ఇలా మాంసాహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నా... దేవస్థానం బాధ్యులు మాత్రం ఏమాత్రం గమనించలేదు. దీనిపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.జరిగిన సంఘటనపై ఆలయ ఈవోతో పాటు పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు.