శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, మాజీ ఐపీఎస్ ఆచార్య కిషోర్ కునాల్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రకటించారు. ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ అయోధ్య రామ మందిర ట్రస్టీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ తో పాటు బిహార్ స్టేట్ రిలీజియస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా, ప్రసిద్ధ మహవీర్ దేవాలయ ట్రస్ట్ కార్యదర్శిగా వున్నారు. ఈ ట్రస్ట్ పాట్నాలో అనేక పాఠశాలలను, క్యాన్సర్ ఆస్పత్రులను నిర్వహిస్తోంది.మాజీ ప్రధాని వీపీ సింగ్ హయాంలో కేంద్ర ప్రభుత్వం, విశ్వహిందూ పరిషత్, బాబ్రీ యాక్షన్ కమిటీ మధ్యవర్తిత్వానికి ప్రభుత్వం ఈయన్ను ప్రత్యేక అధికారిగా నియమించింది.
కిషోర్ కునాల్ 1950, ఆగస్టు 10 న జన్మించారు. ముజఫర్ పూర్ జిల్లాలోని బారురాజ్ గ్రామంలో పాఠశాల విద్య, తదనంతరం కళాశాల విద్యనభ్యసించారు. ఆ తర్వాత పాట్నా యూనివర్శిటీ నుంచి చరిత్ర మరియు సంస్కృతంలో పట్టభద్రులయ్యారు.కిషోర్ కునాల్ 1983లో పదోన్నతి పొంది పాట్నాలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమించబడ్డారు. కునాల్ 1990 నుండి 1994 వరకు హోం మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశారు.
కునాల్ 1990 నుండి 1994 వరకు హోం మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశారు. ఐపీఎస్ అధికారిగా కునాల్ అప్పటికే ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. దీని తరువాత, 2000 సంవత్సరంలో పోలీసు నుండి పదవీ విరమణ చేసిన తరువాత, అతను దర్భంగాలోని KSD సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టారు.