అక్కడ కాదు ఇక్కడ కాదు.. ఏకంగా స్వర్గంలోనే పాస్టర్ ఫ్లాట్ ఇప్పిస్తాడట

VSK Telangana    26-Jun-2024
Total Views |

christian paster 
 
మంచిస్థలాల్లో ప్లాట్లు ఇప్పిస్తాను అంటే ఒక అర్థం. లేదు.... తక్కువ డబ్బులకిప్పిస్తామంటే మరో అర్థం. ఇవన్నీ కాదు... జాతీయ రహదారి పక్కనే ప్లాట్లు... అంటే ఒక అర్థం వుంటుంది. కానీ... స్వర్గంలో ప్లాట్లు ఇప్పిస్తామన్న వ్యక్తుల్ని ఎప్పుడైనా చూశారా? కానీ... స్వర్గంలో ప్లాట్లు ఇప్పిస్తానని, అది కూడా ఏకంగా దేవుడి పక్కకే... అని కర పత్రాలు కూడా వేయించాడు ఓ స్పానిష్‌ పాస్టర్‌. ధర కేవలం ఒక చదరపు మీటరుకు 8 వేలు రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిపోతోంది. 2017 లో తాను ఏసు ప్రభువుతో మాట్లాడానని, స్వర్గంలో ప్లాట్లను విక్రయించడానికి తనకు అధికారం ఇచ్చేశాడని కూడా చెప్పేసుకుంటున్నాడు. ఆ ప్లాట్‌ ఎంత వుంటుందో చెప్పడం లేదు కానీ... స్వర్గంలో దేవుని ప్యాలెస్‌కి అతి దగ్గర మాత్రం ఇప్పిస్తానని తెగ ఊదరగొడుతున్నాడు. అక్కడ ప్లాట్లను ఎలా కొనుగోలు చేయాలన్న పద్ధతి కూడా ఆ బ్రోచర్‌లో వుంటుంది.
 
 christian paster
 
ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆకాశంలో మేఘాల మధ్య ఓ ఇల్లు... ఆ తర్వాత బంగారు మెట్లు, ఓ కుటుంబం ఆ మెట్లు ఎక్కుతున్నట్లు ఆ బ్రోచర్‌ వుంటుంది. అంతేకాకుండా ఆ బ్రోచర్‌పై వీసా, మాస్టర్‌ కార్డ్స్‌, గూగుల్‌ పే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరియు ఆపిల్‌ పేతో సహా చెల్లింపులను చేసే సౌలభ్యం కూడా ఆ కరపత్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో కూడా డబ్బులు కట్టవచ్చని కూడా అందులో కనిపిస్తుంది. రియల్‌ ఎస్టేటర్‌ ఆర్మండో పంటోజా మాట్లాడుతూ.. ఇప్పటికే స్వర్గంలో ప్లాట్లు అమ్మి చర్చి మిలియన్‌ డాలర్లు సంపాదించిందని కూడా తెలిపాడు. ఇప్పటికీ స్వర్గంలో ప్లాట్లు ఉన్నాయని, మీకు కావాలా? అంటూ పాస్టర్‌ అడుగుతున్నాడు.