కేవలం 72 గంటల్లోనే బ్రిడ్జి కట్టేసిన భారత ఆర్మీ...

VSK Telangana    28-Jun-2024
Total Views |
 
 

indian army
 
భారత ఆర్మీ అద్భుతం చేసింది. ఆర్మీ త్రిశక్తి కోర్‌కి చెందిన ఇంజినీర్లు కేవలం 72 గంటల్లోనే 70 అడుగుల బెయిలీ బ్రిడ్జీని నిర్మించేశారు. సిక్కింలోని గ్యాంగ్‌టక్‌ వద్ద డిక్చు సంక్లాంగ్‌ రహదారిపై ఈ నిర్మాణాన్ని చేపట్టారు. జూన్‌ 23 న నిర్మాణ పనులను ప్రారంభించి, 72 గంటల్లోనే నిర్మించేశారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా... సాంకేతిక అడ్డంకులను కూడా అధిగమించి, దీనిని పూర్తి చేసేశారు. ఈ బ్రిడ్జి పూర్తి కావడానికి సరిహద్దు రహదారుల ఆర్గనైజేషన్‌, స్థానిక అధికారులు ఆర్మీకి పూర్తిగా సహకరించారు. ఈ నిర్మాణం సమయంలో వరదలు విపరీతంగా వున్నాయి. దీంతో కమ్యూనికేష్ల వ్యవస్థలో కూడా తీవ్ర అంతరాయం కలిగింది. అయినా... దీనిని పూర్తి చేశారు.
 
కొత్తగా నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల దిక్చు నుంచి సంక్లాంగ్‌ వైపు వెళ్లడానికి వీలవుతుంది.అలాగే మంగన్‌ జిల్లాలోని ప్రజలకు వైద్య సదుపాయం కల్పించడం అధికారులకు మరింత సులువు కూడా అవుతుందని అధికారులు అంటున్నారు. ఇంతటి అద్భుతమైన వంతనను చూసి సిక్కిం అటవీ మంత్రి పింట్సో నామ్‌గ్యాలÊ లెప్చా ఆర్మీని అభినందించారు. సవాలక్ష అనుకూలమైన పరిస్థితులు వున్నా... సైన్యం ఈ బ్రిడ్జిని పూర్తి చేసిందని, అత్యంత అకింత భావంతో పూర్తి చేశారని ప్రశంసించారు.
సరిహద్దు రవాణా ఆర్గనైజేషన్‌ వారు దీనిని సవాల్‌గా తీసుకున్నారు. ఈ నిర్మాణం ద్వారా ఉత్తర సిక్కిం ప్రాంతాలను అనుసంధానం చేయడానికి ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. గత 15 రోజులుగా సిక్కిం ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ సందర్భంగానే ఈ బ్రిడ్జి ప్రయత్నాలు జరిగాయని అధికారులు వివరించారు. ఈ వర్షాల కారణంగా డిక్చు, సంక్లాంగ్‌, టూంగ్‌, మంగన్‌, సంక్లాంగ్‌, సింగతామ్‌, రంగ్‌రాంగ్‌, టూంగ్‌ లాంటి కీలక ప్రాంతాల రోడ్లు బాగా తెబ్బతిన్నాయి. సుమారు 1500 మంది పర్యాటకులు చిక్కుల్లోపడ్డారు.