మా ప్రాంతంలో మైనారిటీ గురుకులం వద్దు: ఆదివాసీల డిమాండ్

VSK Telangana    28-Jun-2024
Total Views |
 
 

aadivaasi
 
షెడ్యూల్‌ ఏరియా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలను రద్దు చేయాలని జైనూర్‌ ఆదివాసి సంక్షేమ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో జైనూర్‌ తాహశీల్దార్‌కి ఓ వినతి పత్రాన్ని అందజేసింది. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఐదో షెడ్యూల్‌1/70 నిబంధనల ప్రకారంగా షెడ్యూల్‌ ప్రాంతంలో మైనారిటీ గురుకులానికి అనుమతి ఇవ్వరాదని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రభుత్వం రద్దు చేయాలని వారు కోరారు. 1997 లో సుప్రీం కోర్టు ‘‘సమత’’ తీర్పు ప్రకారం షెడ్యూల్‌ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా నాన్‌ ట్రైబల్స్‌గా గుర్తించిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాంతంలో మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేయడమంటే భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని కూడా అవమానించడమే అవుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.
 
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జైనూరులో హిందువులపై ముస్లింలు మూకదాడికి దిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆదివాసీ యువకుడైన మర్సుకోల లక్ష్మణ్‌పై గిరిజనేతర వర్గం దాడికి దిగింది. దీంతో తమ ఆదివాసీ సమాజంపై దాడులు జరుగుతున్నాయని ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు తీర్మానాలను కూడా వారు చేసుకున్నారు. ఈ తీర్మానాల ఆధారంగానే మైనారిటీ గురుకులాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
 
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆదివాసిఫై దాడి చేయడంతో ఆదివాసీలు చేసుకున్న తీర్మానాలు ఇవీ 
 

తేదీ 18`52024 నాడు శనివారం రోజున సిర్పూర్‌, లింగాపూర్‌, జైనూర్‌లోని గోండ్వానా పంచాయితీ రాయి సెంటర్‌ ఆధ్వర్యంలో ఆదివాసులం ఈ క్రింది తీర్మానాలు చేశాం.

1. ఏజెన్సీ మండలాలయిన సిర్పూర్‌, జైనూర్‌, లింగపూర్‌ మండలాలలో 1/70 పెసా చట్టాలను ప్రభుత్వ అధికారులు పకడ్బందీగా అమలు చేయాలి.

2. మర్సకోల లక్ష్మణ్‌పై దాడి చేసిన ముస్లిం, గిరిజనేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా అతని కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలి. నాణ్యమైన వైద్యం కూడా అందించాలి.

3. మసీదుల పరిమితిని తగ్గించాలి. బహిరంగంగా పెట్టవద్దు.

4. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి పంపాలి.

5. మా గ్రామాలలో ఐస్‌క్రీం, ఇతర వ్యాపారాల కోసం వచ్చే ముస్లింలను గ్రామాలకు రానివ్వొద్దు. వారు ఎలాంటి వ్యాపారం చేయకూడదు.

6. వలస వచ్చి అక్రమంగా భూములను ఆక్రమించిన వారి భూములను ఐటీడీఏ కోర్టు ద్వారా తిరిగి మాకు అప్పగించాలి.

7.కత్తులతో, కర్రలతో ఏజెన్సీ ప్రాంతం జైనూర్‌లో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ఆదివాసీ యుకుడైన మర్సుకోల లక్ష్మణ్‌పైన దాడి చేసిన సమయంలో ఈ దాడిలో పాల్గొన్న ముస్లింలపై అట్రాసిటీ, హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి.

8. జైనూరులో వుండి ఆదివాసీలపై దాడి చేసి, భయంకరమైన వాతావరణం సృష్టించిన ముస్లింలకు ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేదు. మైదాన ప్రాంతానికి పంపాలి. ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.

ఏజెన్సీ ప్రాంత హక్కులు, చట్టాలకు భంగం కలిగించడమే కాకుండా ఏజెన్సీలో అక్రమ వ్యాపారాలు చేస్తూ, ఆదివాసి జాతి అస్థిత్వంపై దాడి చేయడం రాజ్యాంగం విరుద్ధమని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు.