రాహుల్ చెప్పిన అబద్ధాలు... సైన్యం చెప్పిన నిజాలు

VSK Telangana    05-Jul-2024
Total Views |

Rahul Gandhi Agniveer 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంపై విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. దాన్ని ఒక యూజ్ అండ్ త్రో లేబర్ పథకంగా అభివర్ణించారు. అగ్నివీర్‌లు నష్టపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ దళాలకు, అధికారులకు మధ్య విభజనని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పథకంపై రాహుల్ గాంధీ అన్న మాటల్లో నిజానిజాలేంటో గమనిద్దాం.
1. బీమా
రాహుల్ గాంధీ: అగ్నివీర్‌లకు బీమా కేవలం రూ. 45 లక్షలు అయితే సాధారణ జవాన్లకు రూ. 75 లక్షలు.
వాస్తవం: అగ్నివీర్‌లకు వారి నుంచి ఎటువంటి కంట్రిబ్యుషన్ లేకుండా రూ. 48 లక్షల బీమా కవరేజి చేస్తూ పూర్తిగా ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంది. కాగా, సాధారణ సైనికులకి రూ.50 లక్షల భీమా కోసం నెలకు రూ.5,000 తీసుకుంటుంది.
2. ఎక్స్ గ్రేషియా
రాహుల్ గాంధీ: అగ్నివీర్‌లకు లభించే ఎక్స్-గ్రేషియా రూ.44 లక్షలు. అయితే సాధారణ జవాన్లకు రూ.55 లక్షలు.
వాస్తవం: అగ్నివీర్‌లకు లభించే రూ. 44 లక్షలు, అయితే, అమర జవాన్ల అత్యంత దగ్గరి రక్తసంబంధీకులు లేదా చట్టబద్ధమైన వారసులకు (NOK) రూ. 25 లక్షలు (డ్యూటీపై), రూ. 35 లక్షలు (CI Ops / HAA), రూ.45 లక్షలు (యుద్ధం అమరులైతే...).
3. జీతం బకాయిలు
రాహుల్ గాంధీ: అగ్నివీర్‌లు 4 సంవత్సరాల వరకు జీతం బకాయిలను పొందుతారు, అయితే సాధారణ జవాన్లు పదవీ విరమణ వరకు (15+ సంవత్సరాలు) పొందుతారు.
వాస్తవం: రెగ్యులర్ జవాన్ల NoK (రక్తసంబంధీకులు లేదా చట్టబద్ధమైన వారసులు)లకు జీతం బకాయిలు చెల్లించే విధానమే లేదు, ఇక 15 సంవత్సరాల చెల్లింపు ఊసే లేదు.
4. కుటుంబ పెన్షన్
రాహుల్ గాంధీ: అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యం లేదు, అయితే సాధారణ జవాన్లు జీతంలో 100% పెన్షన్ పొందుతారు.
వాస్తవం : సాధారణ జవాన్ల NoK (రక్తసంబంధీకులు లేదా చట్టబద్ధమైన వారసులు) సాధారణ కుటుంబ పెన్షన్ (చివరి వేతనంలో 50% 10 సంవత్సరాల పాటు... ఆ తర్వాత 30%), విధి నిర్వహణలో మరణించినందుకు ప్రత్యేక కుటుంబ పెన్షన్ (చివరి వేతనంలో 60%) మరియు ఆపరేషన్స్‌లో మరణించినప్పుడు సరళీకృత కుటుంబ పెన్షన్ అందుకుంటారు (చివరి చెల్లింపులో 100%).
5. గ్రాట్యుటీ
రాహుల్ గాంధీ: సాధారణ జవాన్లు 20 లక్షల వరకు గ్రాట్యుటీని పొందుతారు కానీ, అగ్నివీర్‌లు ఎటువంటి గ్రాట్యుటీకీ అర్హులు కాదు.
వాస్తవం: రెగ్యులర్ జవాన్ల గ్రాట్యుటీ అనేది వారు చివరిగా డ్రా చేసిన జీతంపై ఆధారపడి ఉంటుంది, ఇక JCO స్థాయిలో రూ.10-12 లక్షల వరకు ఉంటుంది.
6. పరిగణించవలసిన అంశాలు -
(ఎ) సేవ నుండి విరమణ అయినప్పుడు అగ్నివీర్‌లు రూ. 10.04 లక్షల సేవా నిధి ప్యాకేజీని అందుకుంటారు (వ్యక్తిగత కంటిబ్యుషన్ రూ. 5.02 లక్షలతో పాటు ప్రభుత్వం ద్వారా మిగతా మొత్తం) దానిపై వచ్చే వడ్డీ.
(బి) రెగ్యులర్ క్యాడర్‌లోకి నియామకాలు అగ్నివీర్‌ల నుంచి కూడా జరుగుతాయి. వాళ్ల మెరిట్‌ని బట్టి తీసుకుంటారు.
(సి) 4 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత, అగ్నివీర్‌ల నైపుణ్యం రెండు స్థాయిలు పెరుగుతుంది.
(డి) సైనికులకు లభించే ప్రయోజనాలను తప్పుగా చిత్రీకరించడం, అనవసర రాజకీయాల వల్ల సైనికుల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ పథకంలో చేరాలనుకున్న వ్యక్తులు కూడా పై వ్యాఖ్యల ద్వారా ప్రతికూలంగా ప్రభావితమవుతారు. దేశ భద్రతకు ఈ రెండు పరిణామాలు హానికరం.
(ఇ) మీడియా నివేదికల ప్రకారం, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ రంగం వారు అగ్నివీర్‌ల నాలుగేళ్ల కాలం తర్వాత వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటామని హామీ ఇచ్చాయి.
సాయుధ దళాల పట్ల ఉద్దేశపూర్వకంగా చేసిన మీ ఆరోపణలు, అలాగే తప్పుదారి పట్టించే పోస్ట్‌కి మీరు క్షమాపణలు చెబుతారని ఆశిస్తున్నాము.