అయోధ్య అర్చకులకు ఇక నుండి కొత్త డ్రెస్ కోడ్

VSK Telangana    05-Jul-2024
Total Views |
 
ayodhya
 
అయోధ్య రామాలయ అర్చకుల డ్రెస్‌ కోడులో కొత్త మార్పులు రానున్నాయి. ఇప్పటి నుంచి వారు కొత్త వేష ధారణలో కనిపిస్తారు. సంప్రదాయంగా ఇప్పుడు ధరిస్తున్న కుంకుమ కలర్‌ వస్త్రాల స్థానంలో ప్రకాశవంతమైన పసుపు రంగు తలపాగా, కుర్తా మరియు ధోతీలను ట్రస్ట్‌ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఇక నుంచి గర్భగుడిలోకి స్మార్ట్‌ ఫోన్లను కూడా అర్చకులు తీసుకెళ్లకూడదని నిషేధం విధించింది. అలాగే మరి కొన్ని అంశాల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అర్చకుల వేష ధారణలో ఏకరూపత (యూనిఫాం) సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే.. ఎంత మంది మధ్యలో వున్నా... ఎక్కడ వున్నా... అర్చకులను ఇట్టే పసిగట్టగలగడం వీలవుతుందని, అందుకే డ్రెస్‌ కోడ్‌ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకునితో పాటు 20 మంది అర్చకులు, ట్రైనీ అర్చకులకు కూడా ఇది వర్తించనుంది. ఇప్పటి వరకు కొందరు కుంకుమ కలర్‌ వస్త్రాలు, మరి కొందరు పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారు. ఇప్పటి నుంచి కొత్త డ్రెస్  కోడ్‌లతో కనిపించనున్నారు.