శ్రీశైలం మహా క్షేత్రంలో బయటపడిన 14 వ శతాబ్దపు లింగం

శ్రీశైలం మహా క్షేత్రంలో 14 వ శతాబ్దం నాటి ఓ శివలింగం బయటపడిరది. యాంపీ థియేటర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ థియేటర్‌

VSK Telangana    09-Jul-2024
Total Views |
 
srishylam lingam
 
శ్రీశైలం మహా క్షేత్రంలోని యాంపీ థియేటర్‌ సమీపంలో 14 వ శతాబ్దం నాటి ఓ శివలింగం బయటపడింది. ఈ థియేటర్‌ సమీపంలో భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం అధికారులు సీసీ రోడ్డు, సపోర్టు వాల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో తవ్వకాలు చేస్తుండగా... ఈ పురాతన శివలింగం బయటపడింది. పరిసరాలను  చదును చేస్తుండగా ఈ ప్రాచీన శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు నందీశ్వరుడి విగ్రహం కూడా కనిపించింది. మరోవైపు శివలింగం పక్కనే తెలియని ఓ లిపితో వున్న శాసనాన్ని కూడా గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు.
 
అధికారులు దీనిని ఫొటోలు తీసి, మైసూరులోని ఆర్కియాలజీ విభాగానికి పంపారు. ప్రాథమికంగా మాత్రం సారంగధర మఠం, రుద్రాక్ష మఠం మధ్య వున్న చక్రగుండం వద్ద కపిలయ్య శివలింగం, నందిని ప్రతిష్ఠించినట్లు ఆ శాసనాల్లో వుందని తేలింది. అయితే.. గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం కూడా దొరికింది. గతంలో పంచమఠాన్ని పునరుద్ధరించే ససయంలో అనేక రాగి శాసనాలు, బంగారు, వెండి నాణేలు కూడా లభించాయి. అయితే.. తాజాగా ఈ శివలింగం బయటపడటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాన్నారు. ఈ శివలింగాన్ని చూసేందుకు  చాలామంది భక్తులు వచ్చారు.