గ్రామభారతి ఆధ్వర్యంలో ''మూలం సంత''

VSK Telangana    09-Jul-2024
Total Views |

 
gramabharathi

 గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రామ భారతి, CSR Memorial Foundation సంయుక్త ఆధ్వర్యంలో ‘‘మూలం సంత’’ (Let’s go back to roots… అనే ట్యాగ్‌ లైన్‌తో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 న తార్నాకాలోని మర్రికృష్ణ హాల్‌లో ఈ మూల సంత కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ కార్యమ్రం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ భారతి సంస్థ ప్రారంభమై 28 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి శనివారం వారాంతపు సంత లేదా నెలవారి సంత ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంతలో..

1. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
2. గో ఉత్పత్తులు
3. మిద్దెతోట, దేశీ విత్తనాలు, మొక్కలు
4. వ్యవసాయ విలువ జోడింపు ఉత్పత్తులు
5. ఆయుర్వేద, పంచగవ్య లాంటి ఆరోగ్య విషయాలు
6. ప్రకృతి మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు
7. దేశం, ధర్మం, ప్రకృతి వ్యవసాయం మరియు పాడిపై పుస్తకాలు
8. చేనేత దుస్తులు, వస్త్రాలు
9. కుల వృత్తులు, చేతి వృత్తులు
10. తినుబండారాలు

వీటికి సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన మిల్లెట్‌ ఆహారం, నోరూరించే మిల్లెట్స్‌ ఐస్‌క్రీం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే.. మూలం సంతలో స్టాల్స్‌ పెట్టుకోదలచిన వారు ముందస్తు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు నిబంధన విధించారు. స్టాల్స్‌ ఏర్పాటు నిమిత్తమై 9490850766 లేదా 6305182620 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. అయితే.. స్టాల్స్‌ ఏర్పాటు చేసుకునే వారు 500 రూపాయలు ముందస్తుగా చెల్లించాలని సూచించారు.