అయోధ్య రామాలయ అర్చకుల జీతాలను పెంచిన ట్రస్ట్

VSK Telangana    07-Aug-2024
Total Views |
 
ram
 
శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన అయోధ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవం నుంచి భక్తులు తాకిడి పెరిగింది. రోజురోజుకు అంచనాలు మించి భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిర ట్రస్ట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా రామాలయంలోని ప్రధాన అర్చకునితో పాటు శ్రీరాముని సేవలో నిమగ్నమైన ఇతర సహాయ అర్చకులు, సేవాదార్ల వేతనాలు పెంచింది.
రామాలయం ప్రధాన అర్చకుడి జీతం రూ.3,500 కు పెంచగా, సహాయ అర్చకులు, సేవాదార్ల వేతనాలు కూడా పెంచినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో పూజలు నిర్వహించేందుకు 20 మంది పూజారులకు శిక్షణ ఇచ్చారు. అయితే అర్చకులను నియమించాల్సిన ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీంతో వారికి
15 రోజల పాటు సెలవు మంజూరు చేస్తున్నట్లు రామమందిర ట్రస్ట్ తెలిపింది. జీతాల పెంపు నేపధ్యంలో పూజారులంతా రామమందిర ట్రస్టుకు పూజారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన అర్చకుడి వేతనాన్ని రూ.3500 పెంచగా, సహాయ పూజారి జీతాన్ని రూ.2500 పెంచారు. కొఠారీ, భండారీల జీతాలను కూడా పెంచారు.