రామమందిరంతో యూపీకి భారీ ఆదాయం... రూ.400 కోట్లపైగా జీఎస్టీ

VSK Telangana    11-Sep-2024
Total Views |
 
ram temple
 
అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. జీఎస్టీ రూపంలో దాదాపు రూ.400 కోట్ల లభించినట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాతే మొత్తం జీఎస్టీ వసూళ్ల లెక్క తేలుతుందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి చంపత్ రాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా అంచనా ప్రకారం రామమందిర నిర్మాణంతో ప్రభుత్వానికి రూ.400 కోట్ల జీఎస్టీ రూపంలో సమకూరింది.. మందిర ప్రాంగణంలో మొత్తం 70 ఎకరాల్లో 18 ఆలయాలను నిర్మించనున్నాం.. మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాస్ సహా పలు ఆలయాలు ఇందులో ఉంటాయి.. మేము 100 శాతం పన్ను చెల్లిస్తున్నాం.. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేదు’ అని చంపత్ చెప్పారు.
 
 
తొలి దశ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో బాలక్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఒకవేళ రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చని ట్రస్ట్ కార్యదర్శి చెప్పారు.
 
 
‘రామమందిర నిర్మాణ కోసం జరిగిన ఉద్యమం వల్ల ఎంత మంది ప్రజలు, వారి కుటుంబాలు, బంధువులు ఇబ్బందిపడ్డారో నాకు తెలియదు. ఈ ఈ యాగం (ఉద్యమం) స్వాతంత్య్రం కోసం 1,000 ఏళ్లు నాటి పోరాటం కంటే తక్కువ కాదు. ఇది (ఆందోళన) ప్రజా సంక్షేమం కోసం జరిగింది’ అని పేర్కొన్నారు.
అంతకు ముందు ఆదివారం నాడు మధ్యప్రదేశ్‌లోని ఖరగోవ్ జిల్లాలోని బకావా గ్రామంలో పర్యటించిన చంపత్ రాయ్ ఆయోధ్య కాంప్లెక్స్‌లోని నిర్మిస్తోన్న శివాలయంలో ప్రతిష్ఠించే శివలింగాన్ని ఖరారు చేశారు. ఓ ఐఏఎస్ అధికారి సూచనలతో నర్మదా నది ఒడ్డున ఉన్న బకావా గ్రామానికి వెళ్లినట్టు చెప్పారు. ఇక, అద్భుతమైన, సుందరమైన శివలింగాల తయారీకి బకావా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా శివాలయాల్లో ఈ గ్రామాల నుంచి తీసుకెళ్లిన లింగాలనే ప్రతిష్ఠించడం విశేషం.