ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలోనే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఇంట్లో బైబిల్ చదువుతాను. బయటికి వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తా. డిక్లరేషన్‌లో మానవత్వం అని రాసుకోండి’’ అంటూ ఒకింత అహంకారాన్ని ప్రదర్శిస్తూ వ్యాఖ్యానించారు. టీటీడీ సంప్రదాయంలో చాలా ఏళ్లుగా ‘‘డిక్లరేషన్ ఇవ్వడం’’ అన్న సంప్రదాయం కొనసాగుతోంది. అంటే వేంకటేశ్వర స్వామి అంటే తనకు అపారమైన గౌరవం వుందని ఇతర మతస్థులు దర్శనార్థం వెళ్లినప్పుడు ఇచ్చే ప్రకటన. ఇలా వుంటుందని తెలిసి కూడా... మానవత్వం అని రాసుకోమని ఎలా చెబుతారు? మానవత్వానికి, డిక్లరేషన్‌కి హస్తిమశకాంతరం వుంది. గతంలో తన తండ్రి వైఎస్సార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, తాను ఆయన కొడుకునే కదా అంటూ వ్యాఖ్యానించారు.