మిషనరీ పాఠశాలలో హందూ విద్యార్థులకు బలవంతంగా బీఫ్ తినిపించేందుకు ప్రయత్నించిన మణిపూర్ క్రైస్తవ విద్యార్థులను పాఠశాల సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా హిందువులకు గౌహతిలోని కార్మేల్ మిషనరీ స్కూల్ క్షమాపణలు చెప్పింది. హిందూ విద్యార్థులకు బలవంతంగా బీఫ్ తినిపించేందుకు ప్రయత్నించిన క్రైస్తవ విద్యార్థులను సస్పెండ్ చేశామని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అలాగే తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అలాగే ఓ నోటీసును కూడా జారీ చేసింది.
పాఠశాలలో అన్ని విశ్వాసాలు,పద్ధతులున్న వారు వుంటారని, వారందర్నీ గౌరవించాల్సిన అవసరం వుందన్నారు. ఇకపై భవిష్యత్తులో ఇలా జరగకుండా వుండేందుకు పాఠశాల ఆవరణలో మాంసాహారాన్ని నిషేధిస్తున్నట్లు యాజమాన్యం నోటీసుల్లో పేర్కొంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. ఇక... ఈ ఘటనను నిరసిస్తూ అసోం యువపరిషత్ నిరసన నిర్వహించింది. తప్పు చేసినవారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రిన్సిపాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు.