అయోధ్య రామ మందిర ఆకృతిలో బాలాపూర్ వినాయకుని మంటపం

VSK Telangana    05-Sep-2024
Total Views |

 
balapur

 
హైదరాబాద్ లో అత్యంత ప్రసిద్ధమైన బాలాపూర్ వినాయకుని మంటపం ఈసారి అయోధ్య రామ మందిర ఆకృతిలో తయారు చేశారు. ఈ సారి బాలాపూర్ వినాయకుడు ఈ అయోధ్య రామమందిరంలో కొలువు దీరనున్నాడు. ప్రముఖ డెకెరేటర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నమూనాను రూపొందించారు. ఇప్పటికే బాలాపూర్ లో అయోధ్య నమూనా సిద్ధం కావడంతో...వారం ముందునుంచే అక్కడ భక్తుల సందడి పెరిగింది. సెల్ఫీలు తీసుకుంటూ అయోధ్య ఆలయ పరిసరాల్లో ఉన్నట్టే భావిస్తున్నారు..గతేడాది బెజవాడ దుర్గమ్మ ఆలయ నమూనా ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఈ ఏడాది అయోధ్య రామాలయ నమూనాను దించేసింది.

 

ప్రతి యేడాది బాలాపూర్ గణేష్ అంటే లడ్డూ వేలానికి అత్యంత ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్తంగా ఈ లడ్డూకి మంచి పేరుంది. ఏటికేడు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తోన్న లడ్డూ వేలం..ఈ ఏడాది ఎంత ధర పలుకుతుందో అని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చివరి పూజ జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించే ఉత్సవసమితి..బాలాపూర్‌ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహిస్తుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూ దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పోటీపడి మరీ వేలంపాటలో పాల్గొంటారు. వేలం దక్కించుకున్న వారు ఆ లడ్డూను ప్రసాదంగా స్వీకరించి, ఇతరులకు పంచిపెడతారు. ఆ తర్వాత తమకు పంటలు బాగా పండాలని తమ వ్యవసాయ పొలాల్లో ఈ లడ్డూను చల్లుతారని చెబుతుంటారు.