అంతర్జాతీయ జగద్గురు పీఠం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పరిషత్ వద్దనున్న అంకుశాలో ఈ నెల 11 నుంచి జరిగే గురుపూజా మహోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు విదేశీ సాధకులు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. స్పెయిన్, జర్మనీ, స్విట్జర్లాండ్, బెల్జియం దేశానికి చెందిన 19 మంది సాధకులు స్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతర్జాతీయ జగద్గురు పీఠం అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ గురుప్రసాద్, జగద్గురు పీఠం డైరెక్టర్ పి. రవిశంకర్ తదితరుల ఆధ్వర్యంలో విదేశీ సాధకులు సింహగిరికి వచ్చారు.