సనాతన ధర్మం విషయంలో సంకుచిత బుద్ధి వున్న వారు మహా కుంభమేళాకి వచ్చి, దానిని చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అలాగే ప్రజలను వివిధ కేటగిరీల కింద విభజించే వారు కూడా కుంభమేళాను తిలకించాలన్నారు. కుంభమేళా అనేది సాధారణ కార్యక్రమం కాదని, సనాతన ధర్మ విరాట్ రూపాన్ని సూచించే కార్యక్రమంగా అభివర్ణించారు. సనాతన ధర్మం విరాట్ రూపాన్ని చూడాలనుకునేవారు కుంభమేళాకి రావాలన్నారు.
మహా కుంభమేళా సందర్భంగా ఆల్ ఇండియా రేడియోలో భాగమైన రేడియో ఛానెల్ ‘‘కుంభవాణి’’ని ఆయన ప్రారంభించారు.మహా కుంభ్ కోసం ప్రత్యేక రేడియో ఛానెల్‌ని ప్రారంభించడంలో ప్రసార భారతి చేస్తున్న కృషిని యుపి సిఎం అభినందించారు మరియు మారుతున్న కాలం ఉన్నప్పటికీ అది సవాళ్లను అధిగమించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి వివిక్షా లేకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా, కుల, వర్ణ, లింగ వివక్షలేవీ లేకుండా మహా కుంభమేళా జరుగుతుందని, విభజనవాదులు దీనిని చూసి నేర్చుకోవాలన్నారు. అందరూ సంగమంలో స్నానం చేసి తరించడానికి ఒక్క చోట చేరుతారన్నారు.