సంఘ్‌ను నా సంస్థ అనే ఆత్మీయభావంతో చూస్తా: డాక్టర్ అంబేద్కర్

VSK Telangana    13-Jan-2025
Total Views |
 
rss amberder1
 
భారతరత్న, భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 85 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శాఖను సందర్శించారు.డాక్టర్ అంబేద్కర్ సతారా జిల్లాలోని కరాడ్‌లోRSS శాఖను 1940 జనవరి 2 వ తేదీ నాడు సందర్శించారు, అక్కడ సంఘ్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగించారు.
 
ఈ కార్యక్రమం గురించి 1940 జనవరి 9వ తేదీన మరాఠీ దినపత్రిక కేసరిలో వార్తా ప్రచురితమయింది. విశ్వ సంవాద కేంద్రం (VSK) విదర్భ ప్రాంత్ విభాగం షేర్ చేసిన వార్తల క్లిప్పింగ్‌ సహాయంతో ఈ వార్త ప్రచురించారు. కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ తో తనకి ఒక ఆత్మీయ అనుబంధం ఉందని డాక్టర్ అంబేద్కర్ తన ప్రసంగంలో చెప్పారు.
 
చారిత్రాత్మకమైన ఈ ఘట్టాన్ని స్మరించుకునేందుకు లోక్ కళ్యాణ్ మండల్ ట్రస్ట్ శ్రీ భవానీ సంఘ స్థాన్‌లో ఈ నెల 2 వ తేదీనాడు బంధుత్వ పరిషత్ అనే సైద్ధాంతిక కార్యక్రమాన్ని నిర్వహించింది.అయితే, డా. అంబేద్కర్ ఆర్‌ఎస్‌ఎస్ శాఖను సందర్శించి ప్రసంగించిన మొదటి సందర్భం కాదని రికార్డులు తెలియచేస్తున్నాయి. ఆమ్చే సాహెబ్ అనే పుస్తకం 25 , 53 పేజీలలో ఆయన 1939లో RSS శిబిరాన్ని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. 'ఆమ్చే సాహెబ్' డా. అంబేద్కర్ సన్నిహిత సహచరుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు బాలాసాహెబ్ సాలుంకే జ్ఞాపకాల సంకలనం.
 

Balasahab Salunke 
 
ఏనాడూ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు కానటువంటి సాలుంకే డాక్టర్ అంబేద్కర్ తో కలిసి శాఖ పర్యటనకి వచ్చారు.
సాలుంకే కుమారుడు కశ్యప్ సాలుంకే, భానుదాస్ గైక్వాడ్‌తో కలిసి సంకలనం చేసిన ఈ పుస్తకం బాలాసాహెబ్ సాలుంకే డా. అంబేద్కర్ మధ్య స్నేహంలో అనేక అనుభవాలను విశదీకరిస్తుంది. "అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితమైన ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకునే అదృష్టం నాకు కలిగింది-పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్. వారిని ప్రతాప్ గఢ్ లోని భౌసాహెబ్ గడ్కరీ నివాసంలో 1939 మే 12 న కలుసుకున్నాం," అని సాలుంకే 53వ పేజీలో రాశారు.
 
 
Balasahab Salunke page 25
 
25వ పేజీలో, చివరి పేరాలో ఆయన, "డా. బాబాసాహెబ్ అంబేద్కర్, డా. హెడ్గేవార్ (RSS వ్యవస్థాపకుడు) పూణేలోని భౌసాహెబ్ గడ్కరీ ఇంట్లో కలుసుకున్నారు. శ్రీ భౌసాహెబ్ అభ్యంకర్ మా అందరినీ (బాలాసాహెబ్ సాలుంకేతో సహా) వేసవి శిబిరానికి తీసుకెళ్లారు. డా. అంబేద్కర్ సైనిక క్రమశిక్షణ, సంస్థాగత వర్తన గురించి స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగించారు."
 

Balasahab Salunke page 53 
 
డాక్టర్ అంబేద్కర్ గురించిన ఈ ప్రస్తావనలు చూస్తే RSS గురించి, హిందూ సమాజాన్ని, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలవారిని తప్పుదోవ పట్టించే వారు వ్యాప్తి చేసే అపోహల గురించిన అయోమయం పూర్తిగా తొలగిపోతుంది. ఈ వ్యక్తులు, దళితుల ఉద్ధారకులుగా తమని తాము చెప్పుకుంటుంటే, RSS కార్యకర్తలు మాత్రం అన్ని రకాల విభజనలను అధిగమించి, హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తుంటారు.