2) దేవాలయం క్రింది అంతస్తులో కార్యక్రమం
- దక్షిణ దిశలోని ప్రార్థనా మండపంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్వామికి 'రాగసేవ' సమర్పిస్తారు.
-ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9:00 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో రాంలాల సన్నిధిలో అభినందన గీతాలు, భక్తి గీతాలు, మంగళ హారతులుంటాయి.
3) శ్రీరామచరితమానస' పఠనం
'
యాత్రీ సువిధాకేంధ్ర' (యాత్రికుల సువిధ కోసం ఏర్పాటుచేసిన భవనం) లోని మొదటి అంతస్తులో మూడు రోజుల సంగీతమయ 'శ్రీరామచరితమానస' పఠనం ఉంటుంది.
4) శ్రీరామచరితమానస్' పై ప్రసంగాలు
'అంగద్ టీల మైదానం'లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 3:30 వరకు శ్రీరామకథ మరియు 3:30 నుండి 5:00 గంటల వరకు 'శ్రీరామచరితమానస్' పై ప్రసంగాలు ఉంటాయి.
—-రోజూ సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
- జనవరి 11వ తేదీ ఉదయం నుంచి స్వామివారి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది.
—-
అంగద్ టీల యొక్క అన్ని కార్యక్రమాలకు మొత్తం సమాజాన్ని భక్తులను గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు, ఈ మైదానంలో భద్రతకు సంబంధించిన అవరోధాలు/అడ్డంకులు ఉండవు.
2024 సంవత్సరం ప్రారంభంలో ఐదు లక్షల పదివేలకు పైగా గ్రామాలకు వెళ్లి 17 కోట్ల కుటుంబాలకు చెందిన 40 కోట్లకు పైగా శ్రీరామ భక్తులను కలిసి అక్షతలు ఇచ్చి అయోధ్యకు ఆహ్వానించడం జరిగింది. అయితే అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరాన్ని ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు, 3153 మంది విదేశీయులు దర్శనం చేసుకున్నారు.