అయోధ్య రామాలయం వార్షికోత్సవానికి మరికొన్ని రోజుల ముందు అనూహ్య ఘటన జరిగింది. రహస్య కెమెరాతో ఓ వ్యక్తి ఏకంగా దేవాలయంలోకే ప్రవేశించాడు. రాముడి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. దేవాలయం భద్రతా నేపథ్యంలో ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించారు. ఓ కానీ ఈ భద్రతా నియమాలను ఆ వ్యక్తి ఉల్లంఘించాడు. తన సన్ గ్లాసెస్ కి రహస్యంగా కెమెరాను అమర్చుకున్నాడు. ఎవ్వరికీ అనుమానాలు రాకుండా లోపలకి వెళ్లిపోయాడు.
చెకింగ్ చేసే ప్రాంతాల్లో కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. దీంతో లోపలికి వెళ్లిపోయాడు. వెళ్లగానే ఫొటోలు తీసేశాడు.
అయితే.. ఆ వ్యక్తి కళ్ల దగ్గర ఏదో మెరుస్తున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. తనిఖీలు చేయగా... అది కెమెరా అని తేలింది. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వడోదరాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.