ఉత్తరాఖండ్ లోని ఉదమ్ సింగ్ నగర్ లో 129 అక్రమ మదర్సాలు బయటపడ్డాయి. ఆ మదర్సాలు ప్రభుత్వాల వద్ద అస్సలు నమోదు కూడా చేసుకోలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో చాలా మంది అనుమానితులు కూడా బయటపడుతున్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,000 అక్రమ మదర్సాలు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. మదర్సాలు ఇంత వేగంగా పెరుగుతున్నట్లు విమర్శలు వచ్చినా... ప్రభుత్వం మిన్నకుండిపోయింది. కానీ.. ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతోంది. ఉధమ్‌సింగ్ నగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) పంకజ్ ఉపాధ్యాయ్ తన జిల్లాలోనే 129 మదర్సాలు చట్టవిరుద్ధమని ధ్వజమెత్తారు.
ఈ మదర్సాలకు అస్సలు రిజిస్ట్రేషన్స్ లేవు. అంతేకాకుండా విద్యా నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్వహిస్తున్నారు. పొరుగునే వున్న యూపీలో మదర్సాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ.. ఉత్తరాఖండ్ విషయంలో మాత్రం కఠినమైన నిబంధనలు లేవు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది. మతపరమైన విద్యతో పాటు సైన్స్, ఇంగ్లీష్, సైన్స్, గణితం, హిందీ వంటి సబ్జెక్టులను కూడా బోధించాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
బెంగాల్, బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల నుండి ఈ అక్రమ మదర్సాలలో చేరిన పిల్లలలో చాలా మంది ఉన్నారని వెల్లడి కావడం పరిస్థితి యొక్క అత్యంత ఆందోళనకరమైన అంశం. అయితే... ఈ మదర్సాలకి ఎవరు నిధులను సమకూర్చుతున్నారు, డబ్బులు ఏ అకౌంట్ల ద్వారా వచ్చి పడుతున్నాయన్న దానిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఈ పనిలో వుందని అధికారులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో 2,000 కి పైగా అక్రమ మదర్సాలు వున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా సంఖ్య ఎక్కువగానే వుంటుందన్న అనుమానాలు వస్తున్నాయి.