బెంగాల్ లోని ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో కొనసాగుతున్న ఫెన్సింగ్ పనిపై బీఎస్ఎఫ్ సిబ్బందికి, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ మధ్య వాగ్వాదం రేగింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాల్దా జిల్లాలోని సుఖదేవ్ పూర్ గ్రామం సమీపంలో ఇది జరిగింది. సరిహద్దులో భారత్ వైపున బీఎస్ఎఫ్ జవాన్లు ఫెన్సింగ్ ఆపరేషన్ లో వున్నారు. దీంతో ఈ పనిపై బంగ్లాదేశ్ జవాన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వివాదం రాజుకుంది. భారత సరిహద్దు జవాన్లకి మద్దతుగా గ్రామస్థులంతా ఘటనా స్థలికి చేరుకున్నారు. తాము మద్దతుగా వున్నామని ప్రకటించారు. అంతేకాకుండా భారత్ మాతాకీ జై... వందే మాతరం.. జై శ్రీరామ్ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కూడా అయ్యింది.
ఫెన్సింగ్ పనిని రెండు దేశాలు ముందుగానే అంగీకరించాయి. అయినా... బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనించాల్సిన విషయం. భారత్ సరిహద్దులో కంచె పనులు చేస్తుండగా బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆందోళనకు దిగడంతో అంతరాయం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ముందే ఒప్పందం కుదిరినా.. బంగ్లాదేశ్ వైపు ఆందోళన చేయడం ఖండిచాల్సిన అంశం. భారత్ పనులకు అంతరాయం ఏర్పడినా.. standard Border Management communication protocols అనుసరించి, పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.
తాము ఫెన్సింగ్ చేసుకుంటున్న సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తాత్కాలికంగా పనులకు అంతరాయం ఏర్పడింది. అయితే.. ఈ పనిని రెండు దేశాలు ముందుగానే ఆమోదించాయని బీఎస్ఎఫ్ అధికారులు బంగ్లాదేశ్ ఫోర్స్ కి చెప్పింది.’’ అని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై బీజేపీ నాయకుడు సుబేందు అధికారి స్పందించారు. స్థానిక గ్రామస్థులు బీఎస్ఎఫ్ కి అండగా నిలబడ్డారని ప్రశంసించారు. ప్రజలలో జాతీయ భావాలు బలంగా నాటుకుపోయాయని, ఆ భావాలే బంగ్లాదేశ్ సరిహద్దు దళాలను వెనక్కి పంపడంలో సహాయ కారి అయ్యాయని పేర్కొన్నారు.