''ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్జీవో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్''

    01-Oct-2025
Total Views |
 
mulugu
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ  శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దసరా ఉత్సవ కార్యక్రమం వెంకటాపూర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా సహకార్యవాహ ముక్కు సుబ్బారెడ్డి హాజరై దేశంలో జరుగుతున్న అనేక అంశాలపై స్వాతంత్రానికి పూర్వం హిందువులపై జరుగుతున్న అకృత్యాలను గుర్తు చేశారు. అలాగే ఏ  హిందువు కూడా తాను హిందువునని చెప్పుకోలేని పరిస్థితి ఉండేదన్నారు. అందుకే డాక్టర్జీ ఆరెస్సెస్ ను స్థాపించారని అన్నారు. 100 సంవత్సరాల చరిత్రలో మన దేశం భారతదేశం విశ్వ గురువుగా అవతరించాలన్న సాధన సాగుతోందని,  విదేశీ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
 
 అలాగే సమాజంలో ఐదు రకాల మార్పులు పంచ పరివర్తన తీసుకురావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ స్వదేశీ వస్తువుల వినియోగం,  కుటుంబాన్ని సంస్కరించుకోవడం,  సామాజిక సమరసత, మరియు పౌరులందరూ రాజ్యాంగాన్ని అనుసరించడం పౌర విధులను ఆచరిస్తూ ప్రతి పౌరుడు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రముఖులు భాష పోయిన మహేందర్ జిల్లా శారీరక ప్రముఖ సంపత్ మండల ప్రముఖ ముప్పుపూర్ణేందర్ స్వయం సేవకులు పల్నాటి కోటయ్య , లేగల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.