దేవభూమి అయిన ఉత్తరాఖండ్ లో సంఘ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతన్నాయి. ఇప్పటివరకు ఉత్తరాఖండ్ లో 1351 గ్రామాలలో సంఘ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. దీనిసందర్భంగా సేవాకార్యక్రమాలను, పథసంచలన్ కార్యక్రమాలను స్వయం సేవకులు నిర్వహిస్తున్నారు. జాతీయత, సామాజిక సామరస్యం, సేవ సందేశాలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలలో దాదాపు యాభై వేల మంది స్వయం సేవకులు పూర్తి గణవేశలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథసంచలన్ చేయడానికి వీలుకాని ప్రదేశాలలో ఉదాహరణకు బసుకేదార్, చినబ్ గఢ్, థరాలి, మొదలైన విపత్తు ప్రభావిత ప్రాంతాలలో సేవాకార్యక్రమాలను స్వయం సేవకులు నిర్వహిస్తున్నారు.
హల్ద్వానీలో జరిగిన శతాబ్ది శంఖనాద్ కార్యక్రమంలో, ఆర్‌ఎస్‌ఎస్ సహ-ప్రధాన కార్యదర్శి అలోక్ జీ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. పిథోరగఢ్‌లో, 83 ఏళ్ల మాజీ గవర్నర్ , మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోష్యారి కూడా యువ స్వయం సేవకులతో వర్షంలో కవాతు చేశారు. శ్రీనగర్, పౌరిలో మష్క్‌బీన్ సంగీతంతో, బద్రీనాథ్‌లో ఘోష్ వాయిద్యంతో జరిగిన పథసంచలన్ అందరినీ ఆకర్షించింది. ఇందులో భాగంగా పంచపరివర్తన్ పై అందరికీ అవగాహన కలిగిస్తోంది సంఘ్.
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ప్రతి కుటుంబం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంతీయ ప్రచార అధిపతి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పథసంచలన్ తో పాటుగా ఇతర సమావేశాలు ఊహించిన దానికంటే విజయవంతమయ్యాయి. విపత్తుల ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో చిన్న ప్రదేశాలలో హిందూ సమావేశాలు జరుగుతాయి. భారతదేశాన్ని బలమైన దేశంగా చూడటం ,సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం సంఘ్ లక్ష్యం అని వారు పేర్కొన్నారు.