ఆది కైలాస సన్నిధిలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలు

VSK Telangana    15-Oct-2025
Total Views |
 
 
Rss Adi Kailash
 
సంఘ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతటా ఘనంగా శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. అయితే అతి ఎత్తైన హిమాలయ శిఖరం టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఆదికైలాశ్ శిఖరం దగ్గర కూడా సంఘ స్వయం సేవకులు సంఘ శతాబ్ది వేడుకలను నిర్వహించారు. కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. 5945 మీటర్ల ఎత్తైన ఆది కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. దీనికి ముందు పార్వతితాల్ సమీపంలో నిర్మించిన ప్రాంగణంలో వ్యాస లోయ అని ఉంటుంది. వ్యాస లోయ అనే ప్రాంతం పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల ఎత్తులో ఉన్న ప్రాంతం, వ్యాస మహర్షి ఇక్కడే వేదాలను రాశాడని అంటారు. ఈ సమీపంలోనే పాండవుల తల్లి కుంతి పేరు మీద కుటి గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. గడ్డకట్టే చలి ఉంటుంది.ఇప్పటికి రెండు రోజులు నుండి అక్కడ విపరీతమైన మంచు కురుస్తోంది. అలాంటి వాతావారణ పరిస్థితులను సైతం లెక్క చేయుండా వ్యాసలోయలో సంఘ స్వయం సేవకులు శతాబ్ది వేడుకలను నిర్వహించారు. అక్కడ భగవాద్వజాన్ని ఎగురవేసి, సంఘ ప్రార్థనను ఆలపించారు.