హిందూ ధర్మంలో గోమాతకి అత్యంత పవిత్రమైన ఆరాధనా భావం వుంటుంది. ముక్కోటి దేవతలు కూడా గోవులోనే నివసిస్తారని హిందువులు భావిస్తుంటారు. అలాంటి గోమాతను రక్షించడమే పరమ ధర్మంగా జీవిస్తుంటారు గోరక్షకులు. తమ ప్రాణాలను తెగించి మరీ అక్రమ గోవుల రవాణాను రక్షిస్తుంటారు. ఇందులో గోవుపై కేవలం ఆరాధనా భావం మాత్రమే వుంటుంది తప్పించి, అంతకు మించి ఇతర ఆపేక్షలేమీ వుండవు. కానీ ఇంతటి పవిత్రమైన కార్యంలో వున్న గోరక్షకులనే టార్గెట్ గా చేసుకొని, కొందరు ఛాందసులు తెగబడుతున్నారు. ఇలా ఎప్పటి నుంచో జరుగుతోంది. అలాంటి గోరక్షకులు గోవులను రక్షిస్తున్నా... వారిపైనే కేసులు పెడుతున్నారన్న విమర్శలను జాతీయవాదులు చేస్తున్నారు.
తాజాగా గోరక్షక్ సోనూసింగ్ పై ఇబ్రహీం అతి దారుణంగా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సోనూ సింగ్. అయితే.. తెలంగాణలో గోరక్షక్ పై దాడులు జరగడం ఇదేమీ కొత్త కాదు. అంతేకాకుండా గోరక్షణ చట్టాలను ఉల్లంఘించారని, దాడులు చేశారంటూ, చట్టాలను ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా పండుగల లాంటి సమయంలో బజరంగ్ దళ్ లాంటి నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారి పేర్లనే పదే పదే ప్రస్తావించడం కూడా జరిగింది. హత్యాయత్నం, దోపిడీ, తప్పుడు నిర్బంధం, మతహింస అన్న పేర్లతో అభియోగాలను కూడా మోపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. వాటి వివరాలివీ...
ఇదే యేడాదిలో సిద్ధిపేటలో కూడా ఓ ఘటన జరిగింది.వీహెచ్ పీ నేత రాజారాంతో సహా మరో 14 మందిపై జావీద్ అనే ముస్లిం ఛాందసుడు దాడికి దిగాడు. దీంతో దాడికి దిగిన వారిపై ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇక జూన్ లో పశువుల అక్రమ రవాణాదారునిపై దాడి చేసి, దోచుకున్నారంటూ ఐదుగురు గోరక్షకులను అరెస్ట్ చేశారు. మత హింసను ప్రేరేపించారంటూ గోరక్షకులపై కేసులు నమోదు అయ్యాయి.
2022 లో కర్మన్ ఘాట్ :
హైదరాబాద్ నగరంలో పశువుల అక్రమ రవాణాదారులకు, గోరక్షకుల మధ్య హింసాత్మక ఘర్షణ. దీని తర్వాత ఏడుగురు అరెస్ట్ అయ్యారు,
గోరక్షకులపై కేసుల వివరాలు...
2025 : పోచారం ఘటన : ముగ్గురి అరెస్ట్, హత్యప్రయత్నం, ఆయుధ చట్టం, దోపిడీ పేరుతో అభియోగాలు
2025 : సిద్దిపేట : దాడి, ఎస్సీఎస్టీ చట్టం, ద్వేషపూరిత ప్రసంగాలంటూ కేసులంటూ పలువురి అరెస్ట్
2025, హైదరాబాద్ : దోపిడీ, మతపరంగా రెచ్చగొట్టడం, దాడి చేశారంటూ ఐదుగురి అరెస్ట్
2022, కర్మన్ ఘాట్, ఏడుగురి అరెస్ట్, తప్పుడు నిర్బంధం అంటూ కేసులు
అలాగే జూన్ 8 వ తేదీన అక్రమ పశువుల రవాణాదారునిపై దాడి చేశారంటూ ఐదుగురు గోరక్షకులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
2002 ఫిబ్రవరి 4 వ తేదీన కర్మన్ ఘాట్ లో పశువుల అక్రమ రవాణాదారులకు, గోరక్షకుల మధ్య ఘర్షణ జరిగింది. పశువులను కాపాడడానికి వెళ్లిన గోరక్షకులపై దాడి జరిగింది. దీంతో ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. తరువాత జరిగిన రాళ్ల దాడిలో ఓ పోలీసుకి గాయాలయ్యాయి.మీర్‌పేటలోని టికెఆర్ కమాన్ సమీపంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న పికప్ వ్యాన్‌ను గో సంరక్షకుల బృందం ఆపడంతో ఘర్షణ మొదలైంది.
ఇక 2023 సంవత్సరంలో జూన్ మాసంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ కి చెందిన మహ్మద్ ముష్తాక్ పశువుల అక్రమ రవాణా చేశాడు. బీదర్ నుంచి బయల్దేరాడు.దీంతో పటాన్ చెరు సమీపంలో గోరక్షకులు దీనిని గమనించి, వెంబడించారు. కానీ ముష్తాక్ తప్పించుకున్నాడు.పారిపోవడానికి ఎంబీటీ నేత అమ్జెద్ ఉల్లాఖాన్ సహాయం చేశారు.అంతేకాకుండా గోరక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేశాడు. పైగా అక్రమ పశువుల రవాణాదారులకే పోలీసులు రక్షణనిచ్చారన్న ఆరోపణలూ వచ్చాయి.
ఇక ఇదే యేడాది జూన్ ఒకటో తేదీన కూడా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిభట్లలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిని గోరక్షకులు పట్టుకున్నారు.హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఐదుగురు యువకులు మార్కెట్ నుండి కొనుగోలు చేసిన తొమ్మిది పశువులను తరలిస్తుండగా రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గోరక్షకులు వాటిని అడ్డుకున్నారు.