సంఘటితమై, హక్కుల కోసం పోరాడండి : సంచార జాతులకు భికురాం జీ ఇతాదే సూచన

VSK Telangana    31-Oct-2025
Total Views |
 
kankd
 
కేంద్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ భికురాం జీ ఇతాదే డాక్టర్జీ పూర్వీకుల గ్రామం కందకుర్తిని సందర్శించారు. ఈ సందర్భంగా 100 కి పైగా సంచార జాతి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికతో విన్నారు. బోర్డు అధ్యక్షునిగా వున్న సమయంలో చేసిన పనులను కూడా వారికి వివరించారు. అయితే.. సంచార జాతుల హక్కుల పరిష్కారానికి అందరూ సంఘటితం అవ్వాలని, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
 
మరో వైపు నవీపేట మండలంలో 18 కి పైగా సంచార జాతి కులాలు అత్యంత నిరుపేదలుగా బతుకుతున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి తాను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

kankd2 
అప్పాల ప్రసాద్ రచించిన పుస్తకం ఆవిష్కరణ..
ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ రచించిన పుస్తకాన్ని కూడా ఇదే వేదికగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం సంచార జాతుల గురించి సంబంధించింది. వీరితో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి జాతీయ కార్యదర్శి శ్రీ అనిల్ ఫాడ్,కోశాధికారి శ్రీ పోతంకర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు శరత్ జాదవ్ మరియు ఎస్ సి రిజర్వేషన్ పరి రక్షణ సమితి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి బైరి నర్సింలు సంచార జాతుల కుటుంబాల మధ్యకు వెళ్లి వారిని కార్యక్రమానికి ఆహ్వానించారు.మహిళలు 50 మందికి పైగా పాల్గొన్నారు.
 
పద్మశ్రీ  భికు రాంజీ ఇదాతేని సంచార జాతి మరియు సామాజిక సమరసతా వేదిక జిల్లా,రాష్ట్ర సమితి సభ్యులు,గోదావరీ ఘాట్ సమితి సభ్యులు,శిశుమందిర్ ప్రబంధ కారిణి సభ్యులు సన్మానించారు.
జిల్లా సమరసతా వేదిక కార్యదర్శి శ్రీ బి రమేష్, ఉపాధ్యక్షులు గజానంద్,కార్యదర్శి సందీకర్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.

kankd23 
పెద్దమ్మవారు,దాసరి వారు,చిందు వారు,సిక్ లిగార్ వారు,ఓడ్ వారు,కైకాడి వారు,రెడ్దిక వారు,మొండి బండ వారు,వీర ముష్టి వారు,గోత్రాల వారు,వడ్డెర వారు,మ్యాదరి వారు,కూనపులి వారు,ఆరె మరాఠీ వారు,గోసంగి వారు,యానాది వారు ఇలా 18 జాతుల వారిని ప్రత్యక్షంగా కలిసి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. 14 జాతుల కుటుంబాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

kankd2334 
కేంద్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్,స్వయంగా జోష్యాలు చెపుతూ,దేవాలయాల వద్ద పూలు అమ్ముకునే వంశంలో జన్మించి,తన చుట్టూ వున్న దీన హీన పరిస్థితులను అధ్యయనం చేసి,14 ఏళ్ల వయస్సులోనే బీదవారి కోసం ఒక సమాజ సేవా సంస్థ ప్రారంభించారు. 40 ఏళ్ల పాటు సంచార జాతుల మధ్య పని చేస్తూ, వారి ఉపాధి,నివాసం,కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి,నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరించి,వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించడానికి భికు రాంజీ ఇతాదే విశేషంగా కృషి చేశారు.

kankd23345