సామాజిక సమరసత వేదిక వరంగల్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ దేవాలయ ప్రవేశ కార్యక్రమం జరిగింది. శ్రీరామాలయం రెవిన్యూ కాలనీ సుబేదారీలో జరిగిన ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 నవంబర్ 1936 రోజున తిరువాన్కూర్ మహారాజ్ అందరికి దేవాలయ ప్రవేశం చేయించిన సందర్భన్ని పురస్కరించుకొని జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు.
ప్రాచీన కాలంలో దేశంలో అందరికి దేవాలయ ప్రవేశం ఉండేదని, శ్రీశైలంలో చెంచులు దేవాలయానికి మార్గ నిర్దేశకులుగా ఉండి దైవదర్శనం చేయించే వారిని తర్వాత కాలంలో హిందూ సమాజంలో ఎన్నో దురాచారాలు ప్రవేశించాయని అన్నారు.హిందూ సమాజం ఎప్పుడూ మార్పును స్వీకరించే స్వభావాన్ని కలిగి ఉండే ఏకైక సమాజమని, ఇంతకుముందు ఎన్నో బాల్యవివాహాలు జరిగేవని కానీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా మంచిది కాదని బాల్యవివాహాలు ప్రోత్సహించకుండా వయోజకులు అయిన తర్వాతే వివాహాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా హిందూ సమాజం మారుతోందని, మార్పు కూడా కోరుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరికి దేవాలయ ప్రవేశం కల్పించడం అందరి బాధ్యత అని సూచించారు.
ఈ కార్యక్రమం అనంతరం 50 మంది పారిశుధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణి జరిగింది. తర్వాత అందరూ సామూహిక దైవ దర్శనం చేసుకున్నారు. తదనంతరం సామూహికంగానే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.