అరుణాచల్ ప్రదేశ్ లో అక్రమ మసీదులకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మిస్తున్న APIYO

VSK Telangana    30-Nov-2025
Total Views |
 
arunachal
 
అరుణాచల్ ప్రదేశ్ లో నహర్ గులాన్ కి చెందిన ఎస్పీ సంచలన రిపోర్టును హోంశాఖకు సమర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ లో 12 అక్రమ మసీదుల నిర్మాణం జరిగిందని, అలాగే అక్రమ మదర్సాల నిర్మాణం కూడా జరిగిందని హోంశాఖకు నివేదించారు. అంతేకాకుండా నహర్లాగున్ లోని హెలిప్యాడ్ కి అతి సమీపంలోనే అక్రమ మసీదు నిర్మాణం జరిగిందని, ఇది తీవ్రమైన భద్రతా సమస్యకి మూలకారణం అవుతుందని కూడా నివేదించారు.
 
2009లో మసీదు నిర్మించిన భూమి 2024 ఆగస్టు 31 నుండి లీజులో ఉంది, అంటే లీజు ఒప్పందంపై సంతకం చేయడానికి 15 సంవత్సరాల ముందు గిరిజనుల భూమిలో మసీదును చట్టవిరుద్ధంగా నిర్మించారు. అయితే ఈ మసీదుకి ప్రభుత్వ అనుమతి గానీ, చట్టపరమైన అనుమతి గానీ, రిజిస్ట్రేషన్ గానీ ఏదీ లేదు. ఇక్కడ 10 మంది పిల్లలకు మత పరమైన బోధన కూడా జరుగుతోంది .
 
ఇలా ఈ ప్రాంతంలో అక్రమ మసీదులు పుట్టగొడుగుల్లా వస్తున్నాయని అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ (APIYO)ఇదే విషయంపై స్థానిక హిందువులను నిరంతరం జాగృతం చేస్తూనే వుంది.రాజధాని నగరం ఇటానగర్ మరియు సమీప ప్రాంతాలలో అక్రమ మసీదులు మరియు మదర్సాల నిర్మాణాలకు వ్యతిరేకంగా డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ సర్కారు రాజధాని సమీపంలోని అక్రమ మసీదులు, మదర్సాల జాబితాను కూడా అధికారికంగా విడుదల చేసింది.అందులో జామా మసీదు, బోరం మదర్సా, కొంకడ్ మసీదు, నిర్జులి మసీదు, బోడా నంసి మసీదు మరియు ఆరు పంజా ఖానాలు మొదలైనవి వున్నాయి.
 
అలాగే అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ ప్రధాన కార్యదర్శి టాపోరే మెయింగ్ మరియు అధ్యక్షుడు టారో సోనమ్ లియాక్ అక్రమ మసీదులను సందర్శించిన సమయాల్లో అక్కడి మౌలానాను భారత్ మాతాకీ జై అనమని కోరారు. దీనికి నిరాకరించారు. అప్పుడు వారు మౌలానాను ఈ విధంగా నిలదీశారు. ‘‘"భారత్ మాతా కీ జై అని చెప్పడానికి నిరాకరిస్తే మీరు భారతీయులు ఎలా అవుతారు?" అంటూ సూటిగానే ప్రశ్నించారు.అస్సాం నుండి వచ్చామని తరచుగా చెప్పే బంగ్లాదేశ్ సంతతికి చెందిన ముస్లింలకు APIYO కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ లోపు రాష్ట్రం విడిచి వెళ్లాలని, లేకుంటే కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాలని స్పష్టం చేసింది,

arunachal2 
మియా చొరబాటుదారులపై అవగాహన పెంచడానికి APIYO నవంబర్ 15 నుండి రాజధాని నగరం ఇటానగర్ నుండి ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. వేలాది మంది చొరబాటుదారులు ఈ అందమైన రాష్ట్రంలోకి చొరబడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు మరియు ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని హెచ్చరించింది. అంతేకాకుండా వీరు స్థానికులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు చేస్తున్నారని కూడా స్థానిక ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
 
గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో డజన్ల కొద్దీ అక్రమ మసీదులు మరియు మదర్సాలు వచ్చాయి.మనం ఇప్పుడు మేల్కొనకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది.ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరూ తమ గొంతెత్తడం లేదు. కానీ చాలా ఆలస్యం కాకముందే మనం చర్య తీసుకోవాలి" అంటూ APIYO చైతన్యం తెస్తోంది.