అయోధ్య రామాలయ ప్రధాన అర్చకులు సత్యేంద్రదాస్ మహారాజ్ (87) కన్నుమూశారు. మాఘ పౌర్ణిమ పుణ్య తిథి రోజు (బుధవారం) ఉదయం 7 గంటలకు కన్నుమూశారు. లక్నోలోని PGI ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేహం విడిచిపెట్టారు. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న సత్యేంద్ర దాస్ మహారాజ్ ను లక్నోలోని PGI ఆస్పత్రిలో చేర్చారు. న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన శిష్యులు ప్రదీప్ దాస్ ధ్రువీకరించారు. వీరి అంత్యక్రియలు గురువారం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున జరగనున్నాయి.