పిచ్చి కుదిరింది , రోకలి తలకు చుట్టమన్నాడట.. వెనకటికి ఒకడు. తిరుమలలో టీ.టీ.డీ. నుంచి అన్యమత ఉద్యోగస్తుల్ని బదిలీ చేయడంపై కాంగ్రెస్ నేతల తీరు చూస్తూంటే అంత కంటే పిచ్చి ముదిరిపోయినవారిలా ఉన్నారు. టీటీడీలో క్రైస్తవుల్ని కొనసాగించాలని రోడ్డెక్కి తిరుపతిలో నేడు ధర్నాలు కూడా చేస్తున్నారు
కాంగ్రెస్ నేత చింతామోహన్ వైఎస్ షర్మిల రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న ఏపీ కాంగ్రెస్ నుంచి ఇంత కంటే గొప్ప స్పందనను ఊహించలేము. కానీ, ఇలా బహిరంగంగా రోడ్డున పడి ధర్నాలు చేయడమే కాస్త ముదిరిపోయినట్లుగా అనిపిస్తుంది. మనది సెక్యులర్ దేశమే. సెక్యులర్ దేశం అంటే ఎవరి మతాన్ని వాళ్లు గౌరవించుకోవడం.అంతే కానీ హిందూ ధర్మం, విశ్వాసాన్ని పాటించనివారు, పవిత్రమైన ప్రసాదం సైతం తాకని క్రైస్తవులకు ఆలయాల్లో ఉద్యోగాలిచ్చి పోషించడం తప్పు.
మతం మార్పిడి చేయడానికి తప్ప మరో హిందువును క్రైస్తవ సంస్థల ప్రాంగణాల్లోకి రానిస్తారా? అంతెందుకు, విదేశీ నిధులతో ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి.వాటిలో ఒక్క హిందువుకైనా మత మార్పిడి చేయకుండా ఉద్యోగం ఇచ్చారా? ముస్లిం మత సంస్థల్లో ఇతర మతస్తులకు ఉద్యోగం ఇవ్వడం ఎక్కడైనా ఉందా? వారికి వర్తించని సెక్యూలరిజం ఒక్క హిందూ ఆలయాలకే వర్తింప చేయాలని కాంగ్రెస్ ఎందుకు కోరుకుంటుంది ? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం మాత్రమే.
మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పని కూడా దైవమే. వారికి ఆయా మతాల మీద గౌరవం ఉన్నప్పుడు హిందూ మత సంస్థల్లో పని చేయడం వారి వారి తమ విశ్వాసాలకు భిన్నం కాదా? హిందూ దేవుళ్లను ఆరాధించనప్పుడు ఆయా దేవుడి సన్నిధిలో పని చేయడం, ఆ దేవుడికి సేవ చేయడాన్ని ఎలా స్వాగతిస్తారు ?
ఆ పేరుతో తమ మత ప్రచారాన్ని కొండపై చేస్తూ తిరుమలను ఎప్పటికప్పుడు అపవిత్రం చేయడానికి ప్రయత్నించే వారికి చోటు ఇవ్వడమే సెక్యూలరిజమా ?
కాంగ్రెస్ పార్టీ అంటే పై నుంచి కింది స్థాయి వరకూ నాయకత్వం క్రిస్టియన్లతో నిండిపోయి ఉంటుంది. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ మారింది.మీకు అదేమీ తప్పు కాదు. మీ పార్టీ మీ ఇష్టం. కానీ మీ నాయకుల మెప్పు కోరకు హిందూ మతంపై దాడి చేయాలనుకోవడంమే ప్రమాదకరం.
ప్రజలు ఘోరంగా తిరస్కరించినప్పటికీ చింత చచ్చినా పులుపు చావనట్లు కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజం పేరుతో హిందూ సంస్థల పైన దాడులు చేయడం మానుకోలేదు. హిందూత్వంపై, హిందూ సంస్థలపై దాడి చేయడం, ఇతర మతస్తులను హిందూ దేవాలాయాల్లో పాగావేసేలా చేయడం సెక్యూలరిజం కాదని స్యూడో సెక్యూలరిజం గుర్తు చేస్తున్నాం. ఒకవేళ అదే సెక్యులరిజం అని మీరు వాదిస్తే అటువంటి సెక్యూరిజం హిందువులమైన మాకు అవసరం లేదు.
ఇప్పుడు తిరుమల విషయంలో క్రైస్తవులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగానే క్రిస్టియన్, ముస్లిం సంస్థల్లోనూ హిందువులకు ఉద్యోగాలివ్వాలని రోడ్డెక్కే ధైర్యం ఉందా? టీటీడీతో సహా హిందూ పవిత్ర ఆలయాలపై మాత్రం వివాదాలు సృష్టించడానికి, ఇతర మతాల వాళ్లు ఆక్రమణ చేయడానికి మద్దతుగా మాత్రం తెరపైకి, రోడ్డు పైకి వచ్చేస్తారు.
కాంగ్రెస్ పార్టీకి హిందువులు, హిందూ సమాజం అవసరం లేదా ? హిందువుల విశ్వాసాలను ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? పవిత్ర హిందూ ఆలయాల జోలికి రాకండి. పవిత్రమైన తిరుమల స్వామివారి కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీని హిందూ సమాజం క్షమించదు.
-ఆకారపు కేశవ రాజు, విశ్వహిందూ పరిషత్