స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చలు జరుపుకోవడం ద్వారానే మతపరమైన విభేదాలను నివారించవచ్చని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. సంఘర్షణల పరిష్కారంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. నిత్యమూ ఆత్మ పరిశీలన ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, దీనిపై సమాజం దృష్టి నిలపాలన్నారు.Turkish-American scholar Ahmet T Kuru's book 'Islam Authoritarianism: Underdevelopment - A Global and Historical Comparison' హిందీ వర్షన్ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఇందులో అజిత్ దోవల్ పాల్గొన్నారు.మతం, రాజ్యం మధ్య వైరుధ్యం కొనసాగుతోందని, అయితే... మనం పరిష్కారం కోసం చూస్తున్నామా? అన్నదే ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు.
రాజ్యం లేదా మతం పట్ల వుండే విశ్వసనీయత విషయంలో మాత్రం రాజీపడకూడదని, ఏమీ ఆలోచించకుండా మెదడును ఆపేయడమన్న ప్రక్రియను ఎవ్వరూ అనుమతించవద్దన్నారు. అయితే.. ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోకుంటే దిశ, సమయం కోల్పోవడం మాత్రం ఖాయమన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవడంలో ఆలస్యం జరిగితే వెనకబడిపోతారన్నారు. అన్ని భావజాలల మధ్య పోటీ వున్నందున మతం ఆధారిత సంఘర్షణలు అనివార్యమని తేల్చి చెప్పారు. అలా పోటీ పడకపోతే స్తబ్దత వచ్చేస్తుందని, చివరికి నశిస్తాయన్నారు.మార్పు, ప్రగతి కావాలంటే స్తబ్దత అన్న మబ్బులు వీడిపోవాలని దోవల్ పేర్కొన్నారు. అయితే కొన్ని సమాజాలు ఎందుకు స్తబ్దుగా వుండిపోయాయో ఆలోచించాల్సిన అవసరం వుందన్నారు.