మహారాష్ట్రలో జోరుగా హలాల్ మటన్‌ వ్యతిరేకోద్యమం

VSK Telangana    13-Mar-2025
Total Views |
 
malhar
 
హలాల్ మటన్ కి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఉద్యమం ప్రారంభమైంది. హలాల్ సర్టిఫికేషన్ కి వ్యతిరేకంగా మల్హర్ సర్టిఫికేషన్ వచ్చేసింది. హిందూ పద్ధతుల్లో మాంసం కోసం ఝట్కా పద్ధతికి ఇప్పుడు ఎక్కువగా ప్రమోషన్ కలిపిస్తున్నారు. ఈ దుకాణాలన్నింటినీ ఒకే గొడుకు కిందికి తెచ్చేలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే.. కుహానా లౌకిక వాద కూటములైన కాంగ్రెస్, ఎంవీఏ కూటమి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 
హలాల్ సర్టిఫికేషన్ విషయంలో మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణా కీలక అడుగులు వేశారు.హిందువులు నిర్వహిస్తున్న జట్కా మాంసం దుకాణాలను ప్రోత్సహించేందుకు కొత్తగా మల్హర్ సర్టిఫికేషన్ అందుబాటులోకి తెచ్చారు. మల్హార్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హిందువులే నిర్వహిస్తారని కూడా మంత్రి నితీష్ రాణా ప్రకటించారు. జట్కా మాంసం సరఫరా చేసేవారి కోసం మల్హర్ సర్టిఫికేషన్. కామ్ ప్లాట్ ఫామ్ ను (Malhaarcertification. com) ఏర్పాటు చేయనున్నారు. వీటిని హిందువులే నిర్వహిస్తారన్నారు.
 
హిందూ సమాజం కోసం మహారాష్ట్రలో కీలకమైన అడుగులు వేశామని, హిందూ సమాజంలో మార్పు కోసమే ఈ ఆలోచన చేశామని వివరించారు. మల్హార్ సర్టిఫికేషన్ లేని దుకాణాల నుంచి మటన్ కొనుగోలు చేయవద్దని సూచించారు.‘‘ఈ మల్హార్ సర్టిఫికేషన్ ను మరింత ఎక్కువగా ఉపయోగంలోకి తేవాలి. మల్హార్ సర్టిఫికేషన్ లేకుండా హిందువులు దుకాణాల నుంచి మటన్ కొనరాదు. హిందువులకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్’’ అంటూ రాణే పేర్కొన్నారు.
 
మల్హార్ సర్టిఫికేషన్ అంటే.. హిందూ మాంసం విక్రేతలందర్నీ ఒకే వేదిక కిందకు తీసుకురావడానికి మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చారు. జట్కా మాంసం దుకాణాలను ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నిర్వహిస్తున్నారన్నది ఇది నిర్ధారిస్తుంది. హిందువులు, సిక్కులకు హలాల్ రహిత మాంసం విక్రయించాలన్న లక్ష్యంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం మేక, గొర్రె మాంసాన్ని శుభ్రంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మరే ఇతర జంతు మాంసం కలపకుండా విక్రయించేందుకు మల్హార్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది.