బుద్ద గయ సమస్య పాతదే! తిరగదోడుతున్న కొన్ని స్వదేశీ, విదేశీ శక్తులు

VSK Telangana    24-Mar-2025
Total Views |
 
gaya
 
సిద్ధార్థుడు జ్ఞానోదయం ,పొంది బుద్దుడు అయిన స్థలం మాదే అని ఇక్కడ స్థలంపై నిర్వహణ హక్కు మా బౌద్ధుల చేతిలోనే ఉండాలని ఇక్కడి మందిర కమిటీలో సనాతన ధర్మ వాదులు ఉండరాదని మహారాష్ట్రకు చెందిన కొందరు నవ బౌద్ధులు పాత సమస్యను తిరిగి తోడారు.వీరికి భారతదేశంలోని కొన్ని శక్తులు సహకరిస్తున్నాయి.విదేశాలకు చెందిన కొందరు బౌద్ధులు ఊతమిస్తున్నారు.వీరందరి లక్ష్యం భారత దేశంలో జన్మించిన సనాతన ధర్మం=బౌద్ధం మద్యం స్నేహం ఉండరాదు అన్నదే! వారి అంతిమ లక్ష్యం.
 
బుద్దగయ చారిత్రిక నేపథ్యం ఏమిటి?
 
సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది, తథాగతుడు అయిన బుద్ధ గయ వద్ద సామ్రాట్ అశోకుడు మహా బోధి మందిరాన్ని నిర్మించాడు. అనంతర కాలంలో హిందూ రాజులులైన శుంగ వంశ రాజులు,గుప్త వంశ రాజులు,పాల వంశ రాజులు ఈ మందిర నిర్మాణాన్ని విస్తరింప చేసారు.పాల వంశ రాజు దేవపాలుడు అక్కడ బౌద్ద భిక్షువులు ఉండడంకోసం భవనం నిర్మించాడు.పై రాజులు మహా బోధి మందిరం పై ఇంద్రుడు,లక్ష్మి,సూర్యుడు మొదలగు చిహ్నాలను చెక్కించారు.భారత దేశంలో జన్మించిన ధార్మిక మహా పురుషుల శ్రద్ధా కేంద్రాలను బౌద్దులైనా,జైనులైనా,శిక్కులైనా నిర్మించిన వారిలో సనాతన ధర్మ రాజులూ ఉన్నారు.నేడు కూడా అనేక మంది యిండ్లలో,కార్యాలయాల్లో బుద్ధుని విగ్రహాలు దర్శనం ఇస్తాయి.వారు ఎవరు బౌద్ద ధర్మ అనుయాయులు కారు కదా!
 
Let Noble thoughts come from all directions. ఎక్కడ నుండి నేర్చుకోవాల్సిన మంచి అంశం ఉన్నా నేర్చుకోవాలి అని ఋగ్వేదం చెప్తోంది.బుద్ధుని లోని సమత,కరుణ,అహింస.... వంటి అంశాలను స్వీకరించడం కోసమే 12 వ శతాబ్ది కి చెందిన జయదేవ కవి బుద్ధుడిని దశావతారంలో ఒక అవతారంగా పేర్కొన్నాడు.బుద్ధుని పట్ల అపార గౌరవంతో పేర్కొనడమే ఇది.
 
12 వ శతాబ్దిలో నలందా విశ్వవిద్యాలయంతో పాటే ఈ మందిరాన్ని విదేశీ ముస్లిం ఆక్రమణ దారులు విద్వంసం చేసారు.1590 వరకు మహా బోధి మందిరం వివరాలు తెలియవు.
 
మహా బోధి మందిరం పునరుద్ధరణ
 
1726 లో జమీందారీ ద్వారా కొన్ని గ్రామాలు బోధ గయ మఠముకు లభించడంతో బోధ గయ మఠo ఆధ్వర్యంలో ఈ మందిరం పునర్మింపబడి కొనసాగుతున్నది.
 
1890 వరకు దేశం నలుమూలల నుండి విదేశాల నుండి బౌద్ధులు,సనాతన హిందువులు ఇక్కడకు వచ్చి బుద్ధ గయకు వచ్చి దర్శనం చేసుకునే వారు,ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలుగ లేదు.
 
వివాదం ప్రారంభం
 
శ్రీలంక కు చెందిన అనాగారిక ధర్మపాల్ నూతన బౌద్ద విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నము చేయడంతో వివాదం ప్రారంభం అయింది.దీనిపై కలకత్తా ఉన్నత న్యాయస్థానం 22-08-1895 లో తీర్పు ఇస్తూ, మహా బోధి మందిరం పై హక్కు బోధ గయ మఠానికి ఉందని తీర్పు ఇచ్చింది.
 
గాంధీజీ ముందుకు సమస్య
 
శ్రీలంక బౌద్ద భిక్షువు శ్రీ దర్మపాల్ 1922 లో మహాత్మ గాంధీ నీ కలసి సమస్యకు పరిష్కారం కోరగా 1922లో డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 7 మంది సభ్యులతో కమిటి ఏర్పడింది.
 
సభ్యులు:
 
1) డా.బాబూ రాజేంద్ర ప్రసాద్=అధ్యక్షులు
2) మహంత బోధ గయ మఠము
3)భంతే అనాగారిక ధర్మాపాల్
4) బాబూ బ్రజ కిషోర్ బాబు
5) స్వామి దయానంద
6)కే. పి.జైస్వాల్
7) రాహుల్ సాంకృత్యాయన్
 
వీరందరూ 54 పుటల నివేదికను తయారు చేసారు.
 
ఈ నివేదిక మేరకే మహా బోధి మందిర నిర్వహణ కొరకు దేశ స్వాతంత్ర్యానంతరం బీహార్ అసెంబ్లీ 1949లో BTMC (Bodhgaya Temple Management Committee) చట్టాన్ని చేస్తీ 4 బౌద్ధులు+4 సనాతన హిందువులతో మొత్తం 8 మందితో కమిటీని ఏర్పరచింది. ఈ కమిటీకి హిందువుగా ఉన్న జిల్లా కలెక్టర్ అధ్యక్షులు గా ఉండాలని నిర్ణయం చేసింది.2013లో బీహార్ అసెంబ్లీ జిల్లా కలెక్టర్ హిందువుగా ఉండాలన్న నిబంధనను తొలగించింది.న్యాయాలయ తీర్పు,1953 అసెంబ్లీ చట్టం మేరకు మహా బోధి మందిరం నిర్వహణ BTMC పరిధిలోకి వచ్చింది.
 
నేటి స్థితి - వాస్తవాలు: 
 
నేటి మందిర కమిటీలో 4 బౌద్ధులు ఉన్నారు.ఇద్దరు హిందువులే ఉన్నారు.హిందువులకు చెందిన రెండు స్థానాలు ఖాలీగా ఉన్నాయి.గత 10=15 సం.లలో కమిటీలో బ్రాహ్మణ సభ్యులు ఎవరూ లేరు.మహా బోధి మందిరంకు వచ్చే ఆదాయం=ఖర్చుల పై నియంత్రణ BTMC (బోధగయ టెంపుల్ మేనేజ్ మెంట్ కమిటీ) దే! కొందరు నవ బౌద్ధులు ప్రచారం చేస్తున్నట్లు బ్రాహ్మణులది కాదు.
 
బుద్దుడు,మహా వీరుడు, ఆది శంకరులు,రామానుజులు,బసవేశ్వరుడు,గురు నానక్ దేవ్,సంత్ శిరోమణి రవి దాస్, శ్రీ రామకృష్ణులు, శ్రీరమణులు,అరవిందులు..... ఇలా ఎందరో.....వీరు అందరూ మనకు వందనీయులే! వీరు అందరూ మన దేశ ఉమ్మడి ఆధ్యాత్మిక సంపద.మనం మనకు నచ్చిన మార్గంలో సాధన చేయవచ్చు.పై వారిని అందరినీ సమానంగా గౌరవించాలి.పై మహా పురుషుల శ్రద్ధా కేంద్రాలను భక్తి భావంతో దర్శించవచ్చు,ఈ శ్రద్ధా కేంద్రాలను రక్షించడం అందరి బాధ్యత.వీటి నిర్వహణ అందరి బాధ్యత.
 
పాశ్చాత్య పద్ధతి
 
నేను పిలిచిన పేరుతోనే భగవంతుడిని అందరూ పిలవాలి. నాకు నచ్చిన పేరుతో, రూపంతో భవంతుడిని అందరూ ఆరాధించాలి
 
భారతీయ పద్ధతి
 
దేవుడు ఒక్కడే!.అనేక పేర్లు,అనేక రూపాలు మనమే కల్పించాం! భగవంతుని ఏ రూపంలో కొలిచినా అందరికీ మోక్షం లభిస్తుంది. కనుకనే ఒకే దేవాలయ ప్రాంగణంలో వివిధ దేవీ, దేవతల విగ్రహాలు మన దేశంలో ఉంటాయి. మనకి ఇది సహజం.
 
ప్రయాగ కుంభలో బౌద్ద భిక్షువులు, సనాతన సన్యాసుల ఉమ్మడి ప్రకటన 
 
బౌద్ధం, సనాతన ధర్మం ఒకే వృక్షపు రెండు శాఖలు అని  పూజ్య శ్రీ దలైలామా హైదరాబాద్ విమానాశ్రయంలో 2007లో ప్రకటన చేశారు. దీనిపై పౌరహక్కుల నాయకుడు శ్రీ వరవర రావు వరంగల్‌లో నిరసన ప్రదర్శన చేశారు.