అయోధ్య రామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రదాడి జరపాలనుకున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర భగ్నమైంది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ (19) ని అరెస్ట్ చేశాయి. ఈ ఆపరేషన్ లో హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా భాగమైంది. ఉగ్రదాడి చేయడానికి రెహ్మాన్ రామ మందిర ప్రాంగణంలో రెండు సార్లు నిఘా నిర్వహించినట్లు ఏటీఎస్ గుర్తించింది. రెహ్మాన్ యూపీలోని మిల్కిపూర్ లో వుంటున్నాడు.
ఇస్లామిక్ ఉగ్రవాది రెహ్మాన్ రైలులో ఫైజాబాద్ నుంచి ఫరీదాబాద్ కి ప్రయాణించినట్లుల అధికారులు నిర్ధారించారు.ఈ సమయంలో మరో వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పుడే రెహ్మాన్ కి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు అందినట్లు తెలుస్తోంది. అయితే.. ఇవి ఏ దేశపు గ్రెనేడ్లో తెలియడం లేదు. విచారణ నిమిత్తం వాటిని స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.పాలీ ఏరియాలో నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు చేసి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. రహ్మాన్ మటన్ షాపు నిర్వహించడంతో పాటు, ఆటో కూడా నడుపుతుంటాడు. అతడు పలుమా ర్లు అయోధ్య వెళ్లి రామమందిరాన్ని నిశితంగా పరిశీలించాడు. కీలకమైన సమాచారాన్ని ఐఎ్‌సఐకి అందజేశాడు.
రెహ్మాన్ కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) సభ్యుడని పోలీసుల దర్యాప్తులో తేలింది.AK-47 రైఫిల్స్ మరియు ఇతర ఆయుధాలను నిర్వహించడంలో ISI కార్యకర్తలు అతనికి శిక్షణ ఇస్తున్నారని కూడా విచారణలో తేలింది.అతనికి గ్రెనేడ్లు సరఫరా చేసిన ఫరీదాబాద్‌లోని అతని హ్యాండ్లర్, ISI ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని తెలిసింది.